Karimnagar Blind School Admissions 2023: కరీంనగర్ అంధుల పాఠశాలలో 1 నుంచి పదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
కరీంనగర్‌లోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నర్మద సోమవారం (మే 29) ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఆంగ్లం, 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో..
కరీంనగర్‌లోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నర్మద సోమవారం (మే 29) ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఆంగ్లం, 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుందన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు విద్యతోపాటు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కంప్యూటర్, వివిధ కళల్లో శిక్షణ ఇస్తామన్నారు.
6 నుంచి 14 సంవత్సరాల వయసున్న వారు దరఖాస్తుకు అర్హులు. 40- 100% అంధత్వం ఉన్నట్లు ధ్రువపత్రం సమర్పించాలని తెలిపారు. అన్ని జిల్లాల వారు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు ఎవరైనా దరఖాస్తు చేపుకోవడానికి 9494317315, 9701190124 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.