AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: ‘అబ్బే..పెంచుకోవడానికి ఇచ్చానంతే’ డబ్బులకు ఆశపడి నాలుగేళ్ల పసివాడిని అమ్మిన కన్న తండ్రి!

డబ్బులకు ఆశపడి ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని నాలుగేళ్ల కొడుకును బేరానికి పెట్టాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా గట్టుచప్పుడుకాకుండా అమ్మేశాడు. అనక విషయం బయటికి పొక్కడంతో..

Warangal: 'అబ్బే..పెంచుకోవడానికి ఇచ్చానంతే' డబ్బులకు ఆశపడి నాలుగేళ్ల పసివాడిని అమ్మిన కన్న తండ్రి!
Father Sold His Son
Srilakshmi C
|

Updated on: May 30, 2023 | 12:58 PM

Share

డబ్బులకు ఆశపడి ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని నాలుగేళ్ల కొడుకును బేరానికి పెట్టాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా గట్టుచప్పుడుకాకుండా అమ్మేశాడు. అనక విషయం బయటికి పొక్కడంతో ‘అబ్బే.. అమ్మలేదు! పెంచుకోవడానికి ఇచ్చానంతే’ అంటూ బుకాయించాడు. వరంగల్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. రంగంలో దిగారు.

కరీమాబాద్‌కు చెందిన మసూద్‌కు నాలుగేళ్ల కుమారుడు అయాన్‌ను డబ్బుకు ఆశపడి అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని బావమరిది అక్బర్‌ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా బాలుడి తండ్రి మసూద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తన కొడుకును అమ్మలేదని, పోచమ్మమైదాన్‌లో ఉన్న తమ బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చానని నిందితుడు మసూద్‌ పోలీసులకు తెలిపాడు. వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ కేసును మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ నుంచి మట్టెవాడ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు కుటుంబసభ్యులకు తెలియకుండా ఇతరులకు పెంపకం కోసం కన్నతండ్రి ఎలా ఇస్తాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యులకు డబ్బుల కోసం అమ్మాడా లేదా సంతానం లేనివాళ్లు పెంపకం కోసం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితేగానీ నిజానిజాలు తెలియవని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో