AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి ముందే వధువు జంప్‌! ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన వరుడు..ఆ తర్వాత ఏంజరిగిందంటే

మేళతాళాలతో సందడిగా ఉందా ఇళ్లు. మరికొద్ది క్షణాల్లో తంతు ప్రారంభమవుతుందనగా ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు ప్రియుడితో పరారైంది. సాధారణంగా ఇటువంటి సంఘనలు జరిగితే మగపెళ్లివారు వివాహం రద్దు చేసుకుని

పెళ్లికి ముందే వధువు జంప్‌! ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన వరుడు..ఆ తర్వాత ఏంజరిగిందంటే
Rajasthan Wedding
Srilakshmi C
|

Updated on: May 30, 2023 | 7:18 AM

Share

మేళతాళాలతో సందడిగా ఉందా ఇళ్లు. మరికొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ప్రారంభమవుతుందనగా ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు ప్రియుడితో పరారైంది. సాధారణంగా ఇటువంటి సంఘనలు జరిగితే మగపెళ్లివారు వివాహం రద్దు చేసుకుని తలోదారిన వెళ్లిపోతారు. ఐతే ఈ వరుడు చేసిన పనికి అందరు అవాక్కయ్యారు. వధువు ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెళ్లాడిన వింత ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

రాజస్థాన్‌లోని సైనా గ్రామంలో మనీషా, శ్రావణ్‌ కుమార్‌ అనే వధువరులకు మే 3న పెద్దలు వివాహం నిశ్చయించారు. మరి కొద్ది నిముషాల్లో పెండ్లి అనగా మనీషా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆరా తీస్తే వధువు ప్రియుడితో వెళ్లిపోయినట్లు తెలిసింది. మనీషా తిరిగి ఇంటికి వస్తే ఆమెను వివాహం చేసుకుంటానంటూ శ్రావణ్‌ కుమార్‌ భీష్మించాడు. ఆమె కోసం వారి ఇంట్లోనే 13 రోజులపాటు వేచి ఉన్నాడు. అలంకరించిన పెళ్లి మండపాన్ని కూడా అలాగే ఉంచాడు. మరోవైపు వెళ్లిపోయిన వధువు కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని మే 15న తల్లిదండ్రులకు అప్పగించారు. తర్వాత ఆమెను ఒప్పించి శ్రావణ్‌తో సంప్రదాయబద్ధంగా మే 16న అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. దీంతో వీరి పెళ్లి కథ సుఖాంతమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..