Viral Video: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతి వరకు టెన్షన్‌.. కట్‌చేస్తే.. ధోని శిష్యుడి కూల్ ఫినిషింగ్.. వీడియో

Chennai Super Kings: ధోనీ.. ధోనీ.. ఇదే నినాదం.. అహ్మదాబాద్‌ నరేంద్రమోదీ స్టేడియంలో మార్మోగిపోయింది. వర్షం ఎన్నిసార్లు అడ్డుపడ్డా.. మ్యాచ్‌ వాయిదా పడ్డా.. ఆదివారమే ముగియాల్సిన మ్యాచ్‌.. మంగళవారం ఎర్లీ అవర్స్ వరకు జరిగినా.. చివరకు విజేతగా నిలిచింది ధోనీ జట్టే.

Viral Video: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతి వరకు టెన్షన్‌.. కట్‌చేస్తే.. ధోని శిష్యుడి కూల్ ఫినిషింగ్.. వీడియో
Ravindra Jadeja Csk Vs Gt IPL 2023 Final
Follow us
Shaik Madar Saheb

| Edited By: Venkata Chari

Updated on: May 30, 2023 | 6:44 AM

Ravindra Jadeja Csk Vs Gt IPL 2023 Final: సమయం అర్థరాత్రి ఒకటిన్నర.. టీవీలకు కళ్లప్పగించేశారు క్రికెట్‌ అభిమానులు.. ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? గుజరాత్‌కి వరుసగా రెండో టైటిలా? చెన్నై ఐదోసారి విజేతగా నిలుస్తుందా? స్టేడియం సైలెంట్ గా ఉంది.. పరుగున వచ్చి బంతిని.. లో-ఫుల్‌టాస్‌ వేశాడు మోహిత్‌ శర్మ. లెగ్‌ఫ్లిక్‌తో జడేజా బాల్‌ని బౌండరీకి తరలించడంతో.. నరేంద్రమోదీ స్టేడియం మార్మోగిపోయింది. ఆతర్వాత జరిగిందంతా హిస్టరీ.

ధోనీ.. ధోనీ.. ఇదే నినాదం.. అహ్మదాబాద్‌ నరేంద్రమోదీ స్టేడియంలో మార్మోగిపోయింది. వర్షం ఎన్నిసార్లు అడ్డుపడ్డా.. మ్యాచ్‌ వాయిదా పడ్డా.. ఆదివారమే ముగియాల్సిన మ్యాచ్‌.. మంగళవారం ఎర్లీ అవర్స్ వరకు జరిగినా.. చివరకు విజేతగా నిలిచింది ధోనీ జట్టే. అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పర్ఫెక్ట్‌ బ్యాటింగ్‌ లైనప్‌… పక్కా వ్యూహంతో ఎల్లో జెర్సీ టీమ్‌ ఐదోసారి ఐపీఎల్‌ విజేతగా జెండా ఎగరేసింది.

నిజానికి చెన్నై గెలిచినా.. గుజరాత్‌ చివరకు వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో పరిణతి కనబర్చింది. ముందు బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌.. చెన్నై బౌలర్లపై ఎటాకింగ్‌కే దిగింది. సాహా, గిల్‌ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. గిల్‌ 20బాల్స్‌లోనే 39రన్స్‌ కొట్టి ఔటయ్యాక వచ్చిన సాయి సుదర్శన్‌.. రెచ్చిపోయాడు. ఈ యంగ్‌ పెర్ఫామర్.. ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47బంతుల్లోనే 200స్ట్రైక్‌ రేట్‌తో 96రన్స్‌ చేసి.. సెంచరీ జస్ట్‌ మిస్‌ అయ్యాడు. సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ వల్లే.. గుజరాత్‌ 214పరుగులు చేయగలిగింది.

ఇవి కూడా చదవండి

భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై చేజింగ్‌కి వరుణుడు అడ్డుపడ్డాడు. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో.. రెండు గంటలపాటు మ్యాచ్‌ ఆగింది. చివరకు అర్థరాత్రి 12.10కి ఆట ఆరంభమైంది. కాని 15 ఓవర్లలోనే 170టార్గెట్‌గా నిర్ణయించారు. చెన్నై ఓపెనర్లు 4 ఓవర్లలోనే 50పరుగులు చేసి.. మంచి స్టార్ట్‌ ఇచ్చారు. ముఖ్యంగా కాన్వే బాగా ఆడాడు. 25 బాల్స్‌లో 47రన్స్‌ చేశాడు. అయితే నూర్‌ అహ్మద్‌ కాన్వే, గైక్వాడ్‌ వికెట్లు పడగొట్టాడు. తర్వాత వచ్చిన రహానే వేగంగా ఆడి వెనుదిగిరాడు. డూబే పరుగులు చేయడానికి కష్టపడ్డా.. రషీద్‌ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. అక్కడి మ్యాచ్‌ మరో టర్న్‌ తీసుకుంది. తర్వాతి ఓవర్లో రాయుడు రెండు సిక్సులు, ఓ ఫోర్‌ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. కెరీర్‌ చివరి మ్యాచ్‌లో రాయుడు ఆట ఆకట్టుకుంది. కరెక్ట్‌ టైమ్‌లో బంతిని బౌండరీలు దాటించి జట్టును కాపాడాడు. 13 ఓవర్లో మోహిత్‌ స్లో బంతితో రాయుడిని ఔట్‌ చేశాడు. ఇక వెంటనే ధోనీ రంగంలోకి దిగాడు. కాని తొలి బంతికే క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. తర్వాతి రెండు ఓవర్లని చాలా టైట్‌గా వేశారు గుజరాత్‌ బౌలర్స్‌. చివరి ఓవర్లో 13 రన్స్‌ కొట్టాల్సిన సమయంలో తొలి నాలుగు బంతులకు మూడే రన్స్‌ వచ్చాయి. ఇక చెన్నై పనైపోయింది.. గుజరాత్‌దే విజయం అనుకున్న సమయంలో రవీంద్ర జడేజా ఐదో బంతికి సిక్స్‌ బాదాడు. తప్పనిసరిగా ఫోర్‌ కొట్టాల్సిన టైమ్‌లో జడేజా లో ఫుల్‌టాస్‌ని వెనక్కు కొట్టి ఫోర్‌గా మల్చడంతో.. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది.

నమో స్టేడియం మార్మోగిపోయింది. జడేజా ఫోర్‌ తర్వాత సీఎస్కే ప్లేయర్లంతా ధోనీ దగ్గరికే పరిగేత్తారు. జడేజాని, ధోనీని ఆకాశానికి ఎత్తారు ప్లేయర్లు. రీసెంట్‌ టైమ్స్‌లో ఇలాంటి ఉత్కంఠభరిత ఐపీఎల్‌ ఫైనల్‌ని చూడలేదు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చెన్నై గెలిచింది. ఐదుసార్లు టైటిల్‌ ఎత్తి.. ముంబై రికార్డును సమం చేసింది. మొత్తం చెన్నై ఆడిన 14 సీజన్లలో 10సార్లు ఫైనల్స్‌కి వచ్చిన ధోనీ జట్టు.. ఐదుసార్లు ట్రోఫీలు నెగ్గి.. మరేజట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. సొంత గడ్డపై ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచినందుకు ఆనందంగా ఉందన్నాడు జడేజా. ఇక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు.. ఈ విజయం ఎంతో సంతృప్తినిచ్చిందన్నాడు. 30ఏళ్ల శ్రమ.. రెండు దశాబ్దాల క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయని.. తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఫ్యామీలీకి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సీజన్‌లో 890పరుగులు చేసిన గిల్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌గా నిలిచాడు అంతేకాదు ఆరెంజ్‌ క్యాప్‌ విన్నర్‌ అయ్యాడు. 28 వికెట్లతో షమీ పర్పుల్‌ క్యాప్‌ సాధిస్తే.. యశస్వి జైస్వాల్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డు అందుకున్నాడు. ఇది తన చివరి సీజన్‌ కాకూడదని కోరుకున్నాడు కెప్టెన్‌ ధోనీ. వచ్చే ఏడెనిమిది నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నాడు. ఇక రాయుడు వంటి మంచి క్రికెటర్స్‌ అరుదుగా వస్తారన్నాడు. చివరి ఐపీఎల్‌ ట్రోఫీని రాయుడు చేతుల మీదుగానే అందుకునేలా చేశాడు ఎంఎస్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..