కుక్కలకు భయపడిన చిరుత.. ఎక్కడ దాకుందో మీరే చూడండి
చిరుత ఎంత భయంకరమైన క్రూరమృగమో చెప్పనక్కర్లేదు. దాని వేగం ముందు ఎంతటి బలమైన జంతువైనా బలాదూర్. చిరుత వేటకు దిగిందంటే అవతలి జంతువుకి ఆయువు మూడినట్టే. కానీ ఎంతటి బలవంతుడైనా కాలం, స్థానం కలిసిరాకపోతే తోకముడవాల్సిందే. సరిగ్గా ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది.
చిరుత ఎంత భయంకరమైన క్రూరమృగమో చెప్పనక్కర్లేదు. దాని వేగం ముందు ఎంతటి బలమైన జంతువైనా బలాదూర్. చిరుత వేటకు దిగిందంటే అవతలి జంతువుకి ఆయువు మూడినట్టే. కానీ ఎంతటి బలవంతుడైనా కాలం, స్థానం కలిసిరాకపోతే తోకముడవాల్సిందే. సరిగ్గా ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది. వీధి కుక్కల్ని తక్కువ అంచనా వేయొద్దు.. వాటి ఏరియాలో అవే తోపులు. కొత్తగా ఎవరు వచ్చినా అసలు ఊరుకోవు. వెంటపడి మరీ తరుముతాయి. మనుషులే కాదు. క్రూర మృగాలు వచ్చినా లెక్క చేయవు. చిరుతపులులనైనా సరే వెంబడిస్తాయి. పరిగెత్తిస్తాయి.. అడవిని వదిలి ఆహారం కోసమే వచ్చిందో, దారి తప్పే వచ్చిందో ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చింది. అలా వచ్చిన చిరుత గ్రామంలోని వీధికుక్కల కంటపడింది. మొదట ఒక కుక్కే కదా అని చిరుత భయపడలేదు. తర్వాత గ్యాంగ్ మొత్తం ఎంట్రీ ఇవ్వడంతో చిరుత వెన్నులో వణుకు పుట్టింది. ఇది మన అడ్డా కాదు కనుక వెనక్కి తగ్గడమే నయమనుకున్నట్టుంది. వెంటనే తన కాలికి బుద్ధి చెప్పింది. అక్కడ్నుంచి లగెత్తింది. కుక్కలనుంచి తప్పించుకునే క్రమంలో సమీపంలోని కొబ్బరిచెట్టెక్కేసింది. అలా దాదాపు 18 గంటలు చెట్టుపైనే ఉండిపోయింది చిరుత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వధూవరులు డ్యాన్స్ చేయాలని.. మండపంలో చితక్కొట్టేసుకున్న ఇరు కుటుంబాలు
ప్రపంచంలోని వృద్ధ శునకం !! వయసెంతో తెలుసా ??
వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..
Hyderabad: భర్త అంత్యక్రియలు ముగిశాక భార్య ఆత్మహత్య..
Samantha Weinstein: క్యాన్సర్‌తో పోరాటం.. పెళ్లైన ఆరు నెలలకే నటి సమంతా కన్నుమూత