వధూవరులు డ్యాన్స్ చేయాలని.. మండపంలో చితక్కొట్టేసుకున్న ఇరు కుటుంబాలు
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో వివాహ వేడుకలో చిన్న పాటి యుద్ధమే జరిగింది. వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల బంధుమిత్రుల హడావిడితో పెళ్లి మండపం కళకళలాడింది. విందు సమయంలో వధూవరులిద్దరూ డ్యాన్స్ చేయాలని అక్కడున్న వారు పట్టుబట్టారు.
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో వివాహ వేడుకలో చిన్న పాటి యుద్ధమే జరిగింది. వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల బంధుమిత్రుల హడావిడితో పెళ్లి మండపం కళకళలాడింది. విందు సమయంలో వధూవరులిద్దరూ డ్యాన్స్ చేయాలని అక్కడున్న వారు పట్టుబట్టారు. ఆడపిల్ల డ్యాన్స్ చేయడం ఏంటంటూ అమ్మాయి తరపు వారు అభ్యంతరం చెప్పారు. ఇది మాటల యుద్ధానికి దారి తీసింది. ఆపై ఇరు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ తలపగలగా, మరో వ్యక్తి చేయి విరిగింది. మరో ముగ్గురు గాయపడ్డారు. రామచంద్రపురానికి చెందిన సుబ్రహ్మణ్యంతో తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన పూజితకు పెళ్లి కుదిరింది. వివాహం కోసం నిన్న అమ్మాయి తరపు వారు రామచంద్రపురం చేరుకున్నారు. పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, విందు సమయంలో వధూవరులిద్దరినీ డ్యాన్స్ చేయాలని కోరడం, వధువు తరపు వారు అభ్యంతరం చెప్పడంతో ఈ గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వధూవరులు, వేడుకకు హాజరైనవారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోని వృద్ధ శునకం !! వయసెంతో తెలుసా ??
వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..
Hyderabad: భర్త అంత్యక్రియలు ముగిశాక భార్య ఆత్మహత్య..
Samantha Weinstein: క్యాన్సర్‌తో పోరాటం.. పెళ్లైన ఆరు నెలలకే నటి సమంతా కన్నుమూత
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి వచ్చేసింది.. ఇక ఎండలు లేనట్టే !!
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

