AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘ఛీ.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇంతగా దిగజారాలా?’ జూబ్లీ హిల్స్‌ పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శనపై నెటిజన్ల ఆగ్రహం

జూబ్లీ హిల్స్‌లోని గ్సోరా నైట్‌ పబ్‌లో గత ఆదివారం (మే 28) వన్యప్రాణులను ప్రదర్శించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌ నిర్వహకులు 'వైల్డ్ జంగిల్ పార్టీ' పేరిట జరిపిన ఈవెంట్‌కు వన్యప్రాణులను తీసుకొచ్చారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో..

Hyderabad: 'ఛీ.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇంతగా దిగజారాలా?' జూబ్లీ హిల్స్‌ పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శనపై నెటిజన్ల ఆగ్రహం
Wild Jungle Party
Srilakshmi C
|

Updated on: May 30, 2023 | 10:07 AM

Share

జూబ్లీ హిల్స్‌లోని గ్సోరా నైట్‌ పబ్‌లో గత ఆదివారం (మే 28) వన్యప్రాణులను ప్రదర్శించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌ నిర్వహకులు ‘వైల్డ్ జంగిల్ పార్టీ’ పేరిట జరిపిన ఈవెంట్‌కు వన్యప్రాణులను తీసుకొచ్చారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్లబ్ ప్రాంగణంలో కోబ్రా, లిజార్డ్‌ వంటి పలు జంతువులు ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పార్టీల పేరిట వన్య ప్రాణులను హింసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గజిబిజి శబ్ధలు, సిగరేట్ల పొగ, మద్యం సేవిస్తూ.. చిందులు వేసే అటువంటి వాతావరణంలో మూగ జీవులను ప్రదర్శిస్తూ, హింసిస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.

ఆశిష్‌ చౌదరి అనే యువకు ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ట్వీట్‌ చూసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించి ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ, సీపీకి తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. ఇటువంటి చర్యలు సిగ్గుచేటు అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై జూబ్లిహిల్స్‌ పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

కాగా గతనెలలోనూ ఇదే రీతిలో సైబరాబాద్‌లోని ఓ పబ్‌ నిర్వాహకులు జంతువులను ప్రదర్శనకు పెట్టారు. పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి జంతువులను తీసుకొచ్చి ప్రదర్శనకు పెట్టినట్లు నిర్వహకులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.