AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss Shetty Mr Polishetty: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి నుంచి సెకండ్ సాంగ్.. మరోసారి వాయిస్‌తో ఆకట్టుకున్న ధనుష్

జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. పైగా స్టార్ హీరోయిన్ అనుష్క ఈ సినిమాలో నటిస్తుండటంతో మరింత బజ్ పెరిగింది.

Miss Shetty Mr Polishetty: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి నుంచి సెకండ్ సాంగ్.. మరోసారి వాయిస్‌తో ఆకట్టుకున్న ధనుష్
Miss Shetty Mr Polishetty
Rajeev Rayala
|

Updated on: May 31, 2023 | 12:55 PM

Share

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, సీనియర్ బ్యూటీ అనుష్క కలిసి నటిస్తున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. జాతిరత్నాలు సినిమా తర్వాత నవీన్ నటిస్తున్న సినిమా ఇది. జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. పైగా స్టార్ హీరోయిన్ అనుష్క ఈ సినిమాలో నటిస్తుండటంతో మరింత బజ్ పెరిగింది. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే.. నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమానుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాట ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. హతవిధీ అంటూ సాగె ఈ పాటను స్టార్ హీరో ధనుష్ ఆలపించారు. బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం మాత్రమే ఉంది.

బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం చిత్రాల్లో నటించిన అనుష్క.. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు. తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Follow Us
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..