ఆర్టీసీ బస్సు నడుపుతూ గుండెపోటుతో సీట్లోనే డ్రైవర్ మృతి.. పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు

బస్సు నడుపుతుండగా ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. వెంటనే బస్‌ కండక్టర్‌ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నాటక రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం (మే 30) ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

ఆర్టీసీ బస్సు నడుపుతూ గుండెపోటుతో సీట్లోనే డ్రైవర్ మృతి.. పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు
Bus Driver Dies While Driving
Follow us
Srilakshmi C

|

Updated on: May 31, 2023 | 11:32 AM

బస్సు నడుపుతుండగా ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. వెంటనే బస్‌ కండక్టర్‌ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నాటక రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం (మే 30) ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాకు చెందిన మురిగెప్ప అథాని కేఎస్‌ఆర్‌టీసీ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రయాణికులతో మంగళవారం సాయంత్రం అప్జల్‌పూర్‌ నుంచి విజయపురకు బస్సు బయల్దేరింది. మార్గం మధ్యలో హెడ్‌లైట్ సమస్యతో బస్సు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను దించేసి, బస్సును సిందగి డిపోకు తరలించేందుకు బస్సులో బయల్దేరారు. ఐతే మార్గమధ్యలో బస్సు నడుపుతుండగా డ్రైవర్ మురిగెప్ప అథాని గుండెపోటుతో సీట్లోనే మృతి చెందాడు. దీంతో బస్సు అదుపు తప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది.

బస్సు కండక్టర్ (అడ్మినిస్ట్రేటర్) శరణు తకాలి కింద పడిన డ్రైవర్‌ను పక్కకు జరిపి, బ్రేక్ వేసి బస్సును ఆపేశాడు. కండక్టర్‌ సమయ స్పూర్తితో వ్యవహరించడం మూలంగా పెను ప్రమాదం తప్పినట్లైంది. అదే సమయానికి బస్సులో ప్రయాణికులు లేకపోవడం కలిసివచ్చింది. లేదంటే ఊహకందని ప్రమాదం జరిగేది. సమాచారం అందుకున్న అప్జల్‌పూర్ డిపో సిబ్బంది బస్సు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన సిందగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.