Morgan Stanley Report: అర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. దశాబ్ధ కాలంలోనే దేశం సాధించిన 10 పెద్ద మార్పులు..
Morgan Stanley Report: భారతదేశం 10 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే ప్రపంచస్థాయిలో అత్యుత్తమ స్థానాలను పొందగలిగిందని మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ‘ఇండియా ఈక్విటీ స్ట్రాటజీ అండ్ ఎకనామిక్స్’ అనే పేరుతో వెలువరిచిన..

Morgan Stanley Report On India
Morgan Stanley Report: భారతదేశం 10 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే ప్రపంచస్థాయిలో అత్యుత్తమ స్థానాలను పొందగలిగిందని మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ‘ఇండియా ఈక్విటీ స్ట్రాటజీ అండ్ ఎకనామిక్స్’ అనే పేరుతో వెలువరిచిన నివేదికలో గడిచిన శశాబ్దం కంటే తక్కువ కాలంలో భారతదేశం రూపాంతరం చెందిన విధం, ఈ సమయంలో టాప్ 10 మార్పులను హైలైట్ చేసింది. ముఖ్యంగా భారత్ పాలసీలు, దాని ఆర్థిక వ్యవస్థ, మార్కెట్‌పై వాటి ప్రభావం ఎలా ఉందనే విషయాలను ప్రస్తావించింది.
దశాబ్ధ కాలంలో భారత్‌లో వచ్చిన 10 పెద్ద మార్పులు..
- సరఫరా వైపు విధాన సంస్కరణలు
- ఆర్థిక వ్యవస్థ యొక్క అధికారికీకరణ
- రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం
- సామాజిక బదిలీలను డిజిటలైజ్ చేయడం
- దివాలా ,దివాలా కోడ్
- సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణ లక్ష్యం
- ఎఫ్‌డీఐపై దృష్టి
- భారతదేశం 401(కే) పదవీ విరమణ పొదుపు ప్రణాళిక
- కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ మద్దతు
- బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి ఎంఎన్‌సీ సెంటిమెంట్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




