OTT: ఇకనుంచి ఓటీటీలోను పొగాకు వ్యతిరేక హెచ్చరికలు వేయాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఓటీటీలో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా వేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ ఈ నిబంధనలు గనుత ఉల్లంఘించినట్లైతే.. పబ్లిషర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఓటీటీలో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా వేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ ఈ నిబంధనలు గనుత ఉల్లంఘించినట్లైతే.. పబ్లిషర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పొగాకు, సిగరెట్లు లాంటి ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేధించినటువంటి 2004 నాటి చట్టంలో నిబంధనలు సవరిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీని ప్రకారం ఓటీటీల్లో ప్రదర్శించే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇంకా ఇతర వినోద కార్యక్రమాలకి పొగాకు వినియోగానికి సంబంధించిన దృశ్యాలుంటే ఇకనుంచి తప్పనిసరిగా హెచ్చరికలు జారీ చేయాలని కేంద్రం తెలిపింది.
పొగతాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని థియేటర్లు, టీవీల్లో ప్రదర్శించినట్లుగానే ఓటీటీల్లోను కార్యక్రమం ప్రారంభానికి ముందు. మధ్యలో 30 సెకన్లపాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా ప్రకటనను ప్రదర్శించాలని తెలిపింది. అలాగే పొగాకు ఉత్పత్తులను, వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లెయిమర్‌ను చూపించాలని పేర్కొంది. ఈ సందేశం కూడా నిబంధనలకు తగ్గట్లుగానే.. తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగులో ఉండాలని సూచించింది. మరో విషయం ఏంటంటే ఈ హెచ్చరికల ప్రకటనలు ఓటీటీ కంటెంట్ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








