Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: లైకుల కోసం మరీ ఇలానా..! నడిరోడ్డుపై స్నానం చేశాడు.. కట్ చేస్తే.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్..

ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకులను పెంచుకునేందుకు చేయకూడదని పనులన్నీ చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే ఓ విచిత్ర పని చేసి..

Viral: లైకుల కోసం మరీ ఇలానా..! నడిరోడ్డుపై స్నానం చేశాడు.. కట్ చేస్తే.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: May 31, 2023 | 12:05 PM

ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకులను పెంచుకునేందుకు చేయకూడదని పనులన్నీ చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే ఓ విచిత్ర పని చేసి.. చివరికి బొక్కబోర్లా పడ్డాడు ఒక యువకుడు. తాను చేసినదానికి ప్రపంచమంతా షాక్ అవుతుందని అనుకున్నాడు.. కట్ చేస్తే.. చివరికి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఆ యువకుడి పేరు పార్తిబన్. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వైరల్ వీడియో ప్రకారం.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్కూటీపై కూర్చుని పార్తిబన్ అనే వ్యక్తి తన ఒంటిపై ఓ బకెట్ నీళ్లు దిమ్మరించుకున్నాడు. వెల్లోడ్ రోడ్‌లో అతడు ఈ స్టంట్ చేశాడు. తన ఫ్రెండ్స్ వేసిన రూ. 10 పందెం కోసం.. అతడు ఇది చేయగా.. దీనంతటిని పార్తిబన్ స్నేహితులు రికార్డు చేశారు. చివరికి ఆ వీడియోలో అతడు గెలిచాడని తన ఫ్రెండ్స్ చెప్పడం మీరు వినొచ్చు.

ఇక ఈ విషయమంతా పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడికి ఏకంగా రూ. 3500 జరిమానా విధించారు. ‘పార్తిబన్‌కు ఇన్‌స్టాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు ప్రతీ రోజూ అనేక వైరల్ వీడియోలు పోస్ట్ చేశాడు. గతంలోనూ ట్రాఫిక్‌ను ఇబ్బందిపెట్టే విధంగా కొన్ని స్టంట్స్ చేశాడు’ అని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. పోలీసులు పార్తిబన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ట్రాఫిక్ అంతరాయం కలగించడం, హెల్మెట్ ధరించకపోవడం, ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం లాంటివి రూల్స్ ఉల్లంఘన కిందకు వస్తుందని.. అలా చేయడం నేరమని పేర్కొన్నారు. అతడికి భారీ జరిమానా విధించారు. ఇలాంటివి మరోసారి చెయ్యొద్దని హెచ్చరించారు.