IPL 2023 Final: ‘చెన్నై కప్ గెలిచింది సరే, కానీ’.. ధోని గోల్డెన్ డకౌట్‌పై లిటిల్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sunil Gavaskar on IPL 2023 Final: ప్రపంచ క్రికెట్ అభిమానుల ఆదరణను పొందిన ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. మంగళవారం జగిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మీద చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠభరిత విజయం సాధించిన..

IPL 2023 Final: ‘చెన్నై కప్ గెలిచింది సరే, కానీ’.. ధోని గోల్డెన్ డకౌట్‌పై లిటిల్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sunny On MS Dhoni's Golden Duck
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 31, 2023 | 11:55 AM

Sunil Gavaskar on IPL 2023 Final: ప్రపంచ క్రికెట్ అభిమానుల ఆదరణను పొందిన ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. మంగళవారం జగిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మీద చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠభరిత విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును ధోని సేన సమం చేసింది. అయితే డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. ఫైనల్ మ్యాచ్‌ చివరి దశలో చతికిలపడిపోయింది. ముఖ్యంగా చెన్నై అల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడిన హీరోయిక్ ఇన్నింగ్స్‌ ముందు గుజరాత్ టీమ్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బౌలర్ల అంచనాలు, ఎత్తులు పనిచేయలేదు. ఫలితంగా చెన్నై ఖాతాలోకి మరో టైటిల్ వచ్చి చేరింది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో చెన్నై సాధించిన అనూహ్య విజయంపై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా తొలిసారిగా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. విన్నింగ్ షాట్స్ కొట్టిన సర్ జడేజాను గాల్లోకి ఎత్తుకొని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కప్ గెలిచినందుకు తనకు సంతోషంగా ఉన్నప్పటికీ ధోని పని మాత్రం తనకు బాధ కలిగిస్తోందని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. ‘ఫైనల్ మ్యాచ్‌లో ధోని బ్యాట్ నుంచి విన్నింగ్ రన్స్ వచ్చి ఉంటే.. అది ఇంకా బాగుండేది. అయితే ధోని టీమ్ ప్లేయర్ కనుక విజయం పట్ల బాగానే సంతోషిస్తాడు. టోర్నీ ఫైనల్‌లో సిక్సర్ల మోత మోగించాల్సిన ధోని తొలి బంతికే అవుటై వెనుతిరగడం చాలా బాధగా ఉంది. కానీ మనం గెలవడమే ముఖ్యం కదా. మనం సెంచరీ చేసినా, 5 వికెట్లు తీసుకున్నా టీమ్ ఓడిపోతే సర్వం వృథా. కానీ టీమ్ గెలిచిన మ్యాచ్‌లో మనం సున్నా పరుగులకే అవుటైనా లేదంటే 40-50 పరుగులు చేసినా అది చాలా గొప్ప’ అంటూ లిటిల్ మాస్టర్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా, ఫైనల్ మ్యాచ్‌లో 14 బంతులకు 22 పరుగులు అవసరమైనప్పుడు ధోనీ క్రీజులోకి వచ్చాడు. విశేషమేమిటంటే.. ఎప్పుడూ జడేజా తర్వాత 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే ధోని.. ఆ మ్యాచ్‌లో ఆరో బ్యాటర్‌గా వచ్చాడు. అయితే ఫైనల్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే  క్యాచ్ ఔట్ అయ్యి.. తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ధోని సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఉంటే అద్దిరిపోయేదని సన్నీతో పాటు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..