AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రోహిత్ సేనకు షాకింగ్ న్యూస్.. రంగంలోకి డేంజరస్ బౌలర్.. ఇక దబిడ దిబిడే అంటూ స్టేట్మెంట్..

India vs Australia: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరగనుంది. కాగా, కంగారూ ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

Video: రోహిత్ సేనకు షాకింగ్ న్యూస్.. రంగంలోకి డేంజరస్ బౌలర్.. ఇక దబిడ దిబిడే అంటూ స్టేట్మెంట్..
Josh Hazlewood
Venkata Chari
|

Updated on: May 31, 2023 | 12:12 PM

Share

WTC Final 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్ ముగియడంతో ఇప్పుడు మళ్లీ అందరి దృష్టి అంతర్జాతీయ క్రికెట్ వైపు మళ్లింది. జూన్ 1 నుంచి ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌తో ఒక మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. అదే సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) రెండవ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించడం లేదు. భారత పర్యటనలో కంగారూ జట్టుతో కలిసి వచ్చిన అతను పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత, IPL 16వ సీజన్ మొదటి అర్ధభాగం నుంచి తప్పుకోవల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ICCతో సంభాషణ సందర్భంగా, జోష్ హేజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ గురించి కీలక ప్రకటన చేశాడు. నేను ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాను. జూన్ 7కి ముందు, నెట్స్‌లో నా పూర్తి సామర్థ్యాన్ని నిలకడగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారిస్తున్నాను. ప్రతి నెట్ సెషన్ సమయంలో నేను పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నాను. ఐపీఎల్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాను. ఇప్పుడు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత, నేను మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

హేజిల్‌వుడ్ ఫిట్‌గా లేకుంటే ప్లేయింగ్ 11లో బోలాండ్‌కి చోటు..

భారత్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ పేరును కూడా చేర్చారు. హాజిల్‌వుడ్ మ్యాచ్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉండకపోతే, అతని స్థానంలో స్కాట్ బోలాండ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..