Bharat Bandh: ఫిబ్రవరి 12న భారత్ బంద్.. దేశవ్యాప్తంగా ఆందోళనలు.. ఎందుకంటే..?
ఫిబ్రవరి 12వ తేదీన భారత్ బంద్ జరగనుంది. ఈ మేరు రైతు సంఘాలు యూనియన్ల పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలోని రైతులందరూ ఈ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ క్రమంలో రైతులు బంద్ చేపడుతున్నారు.

అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ వల్ల ప్రధాన వస్తువులు, సేవలపై సుంకాలు తగ్గనున్నాయి. దీని వల్ల భారతదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయని, ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రైతులకు మాత్రం ఈ వాణిజ్య ఒప్పందం వల్ల నష్టం జరిగే అవకాశముందని రైతు సంఘాలు చెబుతున్నాయి. భారత వ్యవసాయాన్ని అమెరికా బహుళజాతి సంస్థలు పూర్తిగా అప్పగించడమే అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ అని ఆరోపిస్తున్నాయి. ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల రైతులు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఫిబ్రవరి 12న బంద్
ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా బంద్ చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ(AIKS), సంయుక్త్ కిసాన్ మోర్చా(SKM) పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా కిసాన్ సభ నేత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల రైతులతో పాటు పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఎండిన డిస్టిలర్ల ధాన్యాలు, పశుగ్రాసం కోసం ఎర్రజొన్న, సోయాబీన్ నూనె వంటి వస్తువులకు మార్కెట్‌ను తెరవడం ద్వారా వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ఎఫెక్ట్ పడనుందని స్పష్టం చేశారు. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌తో భారత్ చేసుకున్న ఒప్పందాలు దేశానికి ఉపయోగకరంగా లేవన్నారు. వారి స్వంత ఆర్ధిక ప్రయోజనాల కోసం ఇది జరిగాయని విమర్శించారు.
ట్రంప్, మోదీ దిష్టిబొమ్మలు దహనం
ఈ నెల 12న చేపట్టనున్న భారత్ బంద్ దేశవ్యాప్తంగా జరగనుందని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. రైతులందరూ ఈ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దేశ ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని తెలిపారు. కాగా ఫిబ్రవరి 2న భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరిగింది. ఆ రోజు ట్రంప్, ప్రధాని మోదీ వాణిజ్య ఒప్పందం గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ.. మోడీతో మాట్లాడటం గౌరవంగా ఉందని, ఆయన తన గొప్ప స్నేహితులలో ఒకరని అన్నారు. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి, అమెరికా లేదా వెనిజులా నుండి చాలా ఎక్కువ కొనుగోలు చేయడానికి ప్రధాని మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు.
