జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్కిడి గ్రామంలో కోతుల గుంపుల మధ్య జరిగిన పోరు స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సాగింది. వేలాది కోతులు రెండు వర్గాలుగా విడిపోయి, ఒకదానిపై ఒకటి భీకరంగా దాడులు చేసుకోవడం గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రాణభయంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వెనుకాడుతున్నారు.