AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు నేవి ఇటీవల పాపులర్ అవుతున్నాయి. ఫిన్‌టెక్ సంస్థలే కాకుండా బ్యాంకులు కూడా ఇటీవల ఈ అకౌంట్లను తెరిచే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ అకౌంట్ల వల్ల కలిగే లాభాలేంటి.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే వివరాలు ఒకసారి చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Feb 08, 2026 | 8:28 PM

Share
యూపీఐ రాకతో దేశంలో బ్యాంకింగ్ రంగం ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. ప్రతీ చిన్న పనికి బ్యాంక్‌కు వెళ్లి గంటలపాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పని తప్పింది. కేవలం ఫోన్‌లోనే ఏ బ్యాంక్ పనైనా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ యాప్‌ల రాకతో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు అనే కొత్త ఖాతాలు వచ్చేశాయి. వీటిని డిజిటల్‌గా వినియోగించుకోవచ్చు.

1 / 5
ఈ డిజిటల్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి ఏ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్, వీడియో కేవైసీ ద్వారా ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే ఓపెన్ చేయవచ్చు. ఓపెన్ చేశాక వెంటనే లావాదేవీలు చేసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలే కాకుండా బ్యాంకులు కూడా ఈ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లను అందిస్తున్నాయి. దీంతో ఇవి సురక్షితమైనవిగా చెప్పవచ్చు.

2 / 5
ఈ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు ఆర్‌బీఐ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. దీంతో డబ్బులను పూర్తి రక్షణ ఉంటుంది. పొదుపు ఖాతాలకు  ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల బీమా ఉంటుంది. మీరు వీడియో కేవైసీ పూర్తి చేయగానే వెంటనే ఈమెయిల్ లేదా ఫోన్‌కు ఖాతా వివరాలు వచ్చేస్తాయి. ఇక మీకు వెంటనే డిజిటల్ వర్చువల్ డెబిట్ కార్డు అందుబాటులోకి వస్తుంది.

3 / 5
ఇక ఫిజికల్ డెబిట్ కార్డు కావాలంటే ఆప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో మీ ఇంటికి డెబిట్ కార్డు వస్తుంది. ఈ డిజిటల్ ఖాతాలను జీరో బ్యాలెన్స్‌తో ఓపెన్ చేయవచ్చు.

4 / 5
ఇక కొన్ని డిజిటల్ ఖాతాలకు సంబంధించి డెబిట్ కార్డులు, ఇతర ఛార్జీలు ఎలాంటివి ఉండవ్. ఇక పూర్తి కేవైసీ పూర్తి చేసేవరకు కొన్ని పరిమితులు ఉంటాయి. దీంతో పూర్తి  వీడియో కేవైసీ పూర్తి చేస్తే మీరు అన్ని సౌకర్యాలు పొందే అవకాశముంటుంది.

5 / 5