ఓ కసాయి తండ్రి దాష్టికం.. కన్న కూతురిని 25 సార్లు కత్తితోపొడిచి హత్య.. వీడియో వైరల్

ఏ తండ్రి తన చేతులతో చేయలేని, చేయకూడని పని ఓ కిరాతకుడు చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురిని 25 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీ షహబాద్ డెయిరీలో మే 18వ తేదీన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం..

ఓ కసాయి తండ్రి దాష్టికం.. కన్న కూతురిని 25 సార్లు కత్తితోపొడిచి హత్య.. వీడియో వైరల్
Surat Man stabs daughter
Follow us

|

Updated on: May 31, 2023 | 1:55 PM

ఏ తండ్రి తన చేతులతో చేయలేని, చేయకూడని పని ఓ కిరాతకుడు చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురిని 25 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీ షహబాద్ డెయిరీలో మే 18వ తేదీన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సూరత్‌లోని సత్య నగర్ సొసైటీలోని ఓ ఫ్లాటులో రామానుజ అనే వ్యక్తి భార్య, కూతురు (19)తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. వేసవి కాలం కావడంతో ఇంటి డాబాపై పడుకుందామని భార్య అడిగింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర కోపోధ్రిక్తుడైన రామానుజ రాత్రి 11.20 గంటల సమయంలో కత్తితో భార్యపై దాడికి దిగాడు. అడ్డొచ్చిన కూతురిని అత్యంత దారుణంగా 25 సార్లు పొడిచి చంపాడు. తండ్రి నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న ఇంట్లోకి ప్రవేశించగా.. ఆ కసాయి తండ్రి కూతురిని వెంబడించి మరీ హత్య చేశాడు. ఆ తర్వాత భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాడు.

ఇవి కూడా చదవండి

ఇరుగుపొరుగు అతన్ని బంధించేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా దాడికి దిగాడు. దీంతో ఎవరూ అతని వద్దకు వచ్చే ధైర్యం చేయలేదు. ఈ దృష్యాలు ఫ్లాట్‌లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రామానుజను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి హత్యకు వినియోగించింన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.