‘అవినాష్‌ తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి’: హైకోర్టులో సునీతారెడ్డి మెమో దాఖలు

YS Viveka murder case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్‌కు..

'అవినాష్‌ తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి': హైకోర్టులో సునీతారెడ్డి మెమో దాఖలు
YS Sunitha Reddy
Follow us

|

Updated on: Jun 01, 2023 | 6:56 AM

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మరోవైపు అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గత వారం జరిగిన వాదనల్లో తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు ఆయన చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి బుధవారం తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు. తన తల్లికి గుండె కవాటాలు మూసుకుపోవడంతో శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొనడంతో తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా అరెస్టు చేయరాదంటూ కోర్టు మే 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే తన తల్లి ఆరోగ్య విషయమై కోర్టుకు తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు తేలితే ఆయనపై చర్యలు తీసుకోవల్సిందిగా ఆమె తన మెమోలో పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం ఆమెకు శస్త్రచికిత్స జరగలేదని తెలిసిందన్నారు.

శస్త్రచికిత్స జరుగుతోందన్న అవినాష్‌ తరపు న్యాయవాది ప్రకటన తప్పు అని, నిర్ధారించడానికి రికార్డులు లేనందున అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి తరఫు న్యాయవాది కోరారు. సంబంధిత రికార్డులు సమర్పించారు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. శస్త్రచికిత్స జరిగినట్లు రికార్డులు లేవని, మెమోను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో మెమోను న్యాయమూర్తి స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.