AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న ‘గాడ్‌ఫాదర్‌’ నటుడు

82 ఏళ్ల అల్‌ పాసినో, నిర్మాత 29 ఏళ్ల నూర్‌ అల్ఫల్లాతో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అల్‌ పాసినో, నూర్‌ అల్ఫల్లా తమ మొదటి సంతానానికి ఆహ్వానం పలకనున్నారు..

82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న ‘గాడ్‌ఫాదర్‌’ నటుడు
Al Pacino
Srilakshmi C
|

Updated on: Jun 01, 2023 | 9:32 AM

Share

ప్రముఖ హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అల్‌ పాసినో నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు. ఎనిమిది పదుల వయసులో ఆయన తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 82 ఏళ్ల అల్‌ పాసినో, నిర్మాత 29 ఏళ్ల నూర్‌ అల్ఫల్లాతో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అల్‌ పాసినో, నూర్‌ అల్ఫల్లా తమ మొదటి సంతానానికి ఆహ్వానం పలకనున్నారు. ప్రస్తుతం నూర్‌ ఎనిమిది నెలల గర్భవతి. ఈ విషయాన్ని అల్‌ పాసినో ప్రతినిధి ఓ మేగజీన్‌కు తెలిపారు.

కాగా అల్, నూర్ గతేడాది నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మువీ ప్రొడ్యూసర్‌ అయిన అల్ఫాల్లా, గతంలో గాయకుడు మిక్ జాగర్‌తో డేటింగ్‌ చేసింది. ఆ తర్వాత బిలియనీర్ నికోలస్ బెర్గ్రూయెన్‌తో కూడా కొన్నాళ్లు కలిసి ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అల్‌ పాసినో ఇద్దరు మహిళతో సహజీవనం చేసి ముగ్గురు సంతానానికి తండ్రి అయ్యాడు. మొదటి మాజీ ప్రియురాలు జాన్‌ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ(33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో కవలలు (22) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో