Telangana Rains: జూన్‌ రెండో​వారంలో తెలంగాణకు నైరుతి రాక..! ఈసారి కాస్త ఆలస్యంగానే

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్‌ రెండో వారంలో ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈనెల మొదటి వారంలో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ..

Telangana Rains: జూన్‌ రెండో​వారంలో తెలంగాణకు నైరుతి రాక..! ఈసారి కాస్త ఆలస్యంగానే
Rains
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 01, 2023 | 8:17 AM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్‌ రెండో వారంలో ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈనెల మొదటి వారంలో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు క్రమంగా జూన్‌ రెండో వారం నాటికి తెలంగాణను తాకే అవకాశం ఉంది. రుతుపవనాలు ప్రవేశించడంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నల్లగొండలో 41.5, నిజామాబాద్‌ 40.9, భద్రాచలం, మెదక్‌ జిల్లాల్లో 40.8 చొప్పున, ఆదిలాబాద్‌లో 40.3, హైదరాబాద్‌లో 38.9 డిగ్రీలు నమోదైంది.

గత రెండు సీజన్లలో పోల్చితే ఈసారి కాస్త ఆలస్యంగానే రుతుపవనాలు రానున్నాయి. 2021లో నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే కేరళను తాకగా, జూన్‌ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకాయి. ఇక గతేడాది మే 30న రుతుపవనాలు కేరళను తాకగా.. జూన్‌ 8కి రాష్ట్రానికి చేరాయి. ఈ రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం పరిశీలిస్తే.. 50 శాతం అధిక వర్షాలు కురిశాయి. 2021లో రాష్ట్రంలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2022 సీజన్‌లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడాయి.

నేడు రేపు చెదురుమదురుగా వర్షాలు

పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని వాతావరణ శాఖ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు