Telangana Formation Day: రాష్ట్ర ఆవిర్భావ దినోవత్సవ వేడుకలకు మాజీ స్పీకర్.. తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకపాత్ర..
Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 2న రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు 10వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా..

Former Speaker of the Lok Sabha Meira Kumar

Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 2న రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు 10వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హాజరుకానున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం లోక్సభలో తెలంగాణ బిల్లును ఆమోదించడంలో మీరాకుమార్ కీలకపాత్ర పోషించారు. 2014లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించినప్పుడు మీరాకుమార్ లోక్సభ స్పీకర్గా ఉన్నారు.
ఇక ఆమె స్వయంగా దివంగత దళిత నాయకుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తె. అలాగే మీరాకుమార్ను ప్రజాస్వామ్యానికి ప్రతిబింబంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఎందుకంటే సీమాంధ్రకి చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా బిల్లు ఆమోదింపబడేలా మీరా కుమార్ చేశారు.
కాగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్ ఎంపీలు.. ఇతరులపై పెప్పర్ స్ప్రే కొట్టి గందరగోళం సృష్టించిన సమయంలో బిల్లును ఆమోదించడానికి తలుపులు మూసివేయాలని ఆమె ఆదేశించించారు. ఈ మేరకు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరణలో మీరాకుమార్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ జూన్ 2న జరిగే 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమెను సత్కరిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..