Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బిడ్డ పుట్టాక ముఖం చాటేసిన అమర ప్రేమికుడు
ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని తల్లిని చేశాడో ప్రేమికుడు. తీరా బిడ్డ పుట్టాక ముఖం చాటేశాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని తల్లిని చేశాడో ప్రేమికుడు. తీరా బిడ్డ పుట్టాక ముఖం చాటేశాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీ మహాలింగాపురానికి చెందిన నర్సింహారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి వృత్తి రిత్యా వ్యాపారి. గత కొంతకాలంగా స్థానికంగా ఓ కాలేజీలో బీటెక్ చదివే యువతితో అతను సన్నిహితంగా ఉండసాగాడు. ఈ క్రమంలో యువతిని ప్రేమించానని, వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో సదరు యువతి తాజాగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.
దీంతో పెళ్లికి ముందే గర్భం, బిడ్డ జన్మించడంతో ఇరుగుపొరుగు సూటిపోటి మాటనలకు తాళలేక నాలుగు రోజుల క్రితం ఎల్బీనగర్‌కు చేరుకుంది. అక్కడ తన చిన్నమ్మ ఇంటికి సమీపంలోని ఓ గదిలో అద్దెకు ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్‌రెడ్డి, అతని తండ్రి నర్సింహారెడ్డితో కలిసి యువతి ఉంటున్న ఇంటికి వెళ్లారు. యువతిని బెదిరించి, ఆమె బిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని కార్తీక్‌రెడ్డి చెప్పారు. డీఎన్‌ఏ టెస్టు చేయించి బిడ్డకు తండ్రి కార్తీక్‌రెడ్డేనని తేలితేనే వివాహం చేస్తానని కార్తీక్‌రెడ్డి తండ్రి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.