Khammam: రైల్వేస్టేషన్‌లో గుండెలు మెలిపెట్టే ఘటన.. మహిళ ట్రైన్ ఎక్కుతుండగా ఏం జరిగిందంటే..?
Khammam News: ఆ దంపతులిద్దరూ.. ఆసుపత్రిలో చెకప్ కోసం ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరి వెళ్లారు.. ఆసుపత్రిలో పరీక్షలు అయిన తర్వాత.. మళ్లీ ఇంటికి వచ్చేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లారు. వారు వెళ్లాల్సిన ట్రైన్ రానే వచ్చింది. ఇంతలో ఎక్కుదామని ట్రైన్ దగ్గరకు వెళ్లారు..
Khammam News: ఆ దంపతులిద్దరూ.. ఆసుపత్రిలో చెకప్ కోసం ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరి వెళ్లారు.. ఆసుపత్రిలో పరీక్షలు అయిన తర్వాత.. మళ్లీ ఇంటికి వచ్చేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లారు. వారు వెళ్లాల్సిన ట్రైన్ రానే వచ్చింది. ఇంతలో ఎక్కుదామని ట్రైన్ దగ్గరకు వెళ్లారు.. భర్త ట్రైన్ ఎక్కాడు.. భార్య ఎక్కాల్సి ఉంది.. ఈ సమయంలో ఆమె రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండంగా.. కాలు స్లిప్ అవ్వడం.. ట్రైన్ కదలడం రెండు ఒకే సారి జరిగాయి.. దీంతో క్షణాల్లోనే కాలు నుజ్జునుజ్జయింది.. ఈ దారుణ ఘటన ఖమ్మం రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది..
మధిరకు చెందిన కల్యాణి, ఆమె భర్త నాగేశ్వరరావు ఓ ఆస్పత్రిలో చెకప్ కోసం ఖమ్మం వచ్చారు. పని పూర్తి చేసుకుని మళ్లీ మధిర వెళ్లేందుకు ఖమ్మం స్టేషన్‌కు చేరుకున్నారు. అదేసమయంలో ఇంటర్‌సిటీ రైలు రావడంతో.. భర్త నాగేశ్వరరావు బోగీలోకి ఎక్కారు. వెనుక ఉన్న కల్యాణి ఎక్కే సమయంలోనే రైలు ఒక్కసారిగా కదిలింది. ఆ సమయంలో స్లిప్ అవడంతో.. బోగీ-ప్లాట్‌ఫామ్ మధ్యలో ఉన్న గ్యాప్‌లోకి జారిపోయింది కల్యాణి.
గమనించిన కొందరు ప్రయాణికులు వెంటనే.. రైలుని ఆపేందుకు చైన్ లాగారు. అయితే ట్రైన్ ఆగడానికి 20సెకన్లు పట్టింది. ఈలోపు కల్యాణికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె కాలు నుజ్జునుజ్జైంది. చాలాసేపు అక్కడే రోదించింది కల్యాణి. తనను రక్షించాలంటూ అక్కడున్న వారందర్నీ వేడుకుంది. ప్రయాణికులు, సిబ్బంది పరుగున వచ్చి.. ఆమెను అతికష్టంమీద బయటకు తీశారు. వెంటనే కల్యాణిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..