Konda Murali: ‘టచ్ చేస్తే క్రేన్‌కు ఉరేస్తా’.. చర్యలు తీసుకోకపోతే పాత కొండా మురళి బయటకొస్తాడు..
Warangal Congress News: కాంగ్రెస్ కార్యకర్తలకు, తన అనుచరులకు ఏం జరిగినా వదిలిపెట్టనని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే వాళ్లను క్రేన్‌కు ఉరేస్తానని హెచ్చరించారు.
Warangal Congress News: కాంగ్రెస్ కార్యకర్తలకు, తన అనుచరులకు ఏం జరిగినా వదిలిపెట్టనని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే వాళ్లను క్రేన్‌కు ఉరేస్తానని హెచ్చరించారు. ముందు పోలీసులకు వాళ్లపై ఫిర్యాదు చేస్తామని.. వాళ్లు చర్యలు తీసుకోకపోతే మాత్రం.. పాత కొండా మురళి బయటికొస్తాడంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చే వాళ్లతో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలంటూ కొండా మురళి కార్యకర్తలకు సూచించారు.. నాయకులు.. ఎంతమంది వచ్చినా వరంగల్ తూర్పు నుంచి గెలిచేది మాత్రం కొండా సురేఖనే అంటూ స్పష్టంచేశారు. కార్యకర్తలకు ఏం జరిగినా వదిలిపెట్టనని.. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. అంతర్గత విబేధాల నేపథ్యంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాగా.. ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియామించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ఈ ప్రమాణ స్వీకరానికి కొండా సురేఖను పిలవలేదంటూ ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అబ్నూస్ పంక్షన్ హాల్ లో కొండా మురళి-సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. ఇరువర్గాల కార్యకర్తలు.. పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..