Telangana Formation Day: గొప్ప సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ ప్రతీక.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ వేడుకల్లో భాగస్వాములవుతన్నారు. అలాగే ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు

Telangana Formation Day: గొప్ప సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ ప్రతీక.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
President Droupadi Murmu
Follow us
Basha Shek

|

Updated on: Jun 02, 2023 | 10:36 AM

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ వేడుకల్లో భాగస్వాములవుతన్నారు. అలాగే ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉన్న తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. అలాగే ఎందరో ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే పుట్టారు. తెలంగాణ అభివృద్ధి, అలాగే శ్రేయస్సు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని తెలిపారు ద్రౌపది ముర్ము. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గొప్ప వారసత్వం, సంస్కృతికి ఈ రాష్ట్రం ప్రతీక. అలాగే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు వివిధ రంగాల్లో రాణిస్తూ భారత్‌ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే అభివృద్ధి చెందుతూ, మరిన్ని అత్యుత్తమ శిఖరాలను అధిరోహించాలి’ ట్వీట్‌ చేశారు ఉపరాష్ట్రపతి.

ఇక లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. తెలంగాణ ప్రజలు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు స్పీకర్‌ ఓం బిర్లా. ఇక కేంద్రమంత్రి గోల్కోండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యిందన్నారు. సుష్మ స్వరాజ్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..