AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమలో కొత్త పిచ్చి! జెన్-జీ ప్రయోగాలు.. రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా ప్రేమలో పడాల్సిందేనా?

'డెలూలు' అంటే 'డెల్యూషనల్' అని అర్థం. అంటే వాస్తవంలో లేని దానిని ఉన్నట్లుగా భ్రమపడటం. సాధారణంగా ఎవరైనా ఒక చెడు అనుభవం ఎదురైతే జాగ్రత్తపడతారు. కానీ, డెలూలు డేటింగ్‌లో మాత్రం ఎదుటి వ్యక్తిలో ఎన్ని లోపాలు ఉన్నా, అవన్నీ పక్కనపెట్టి 'అంతా మంచే జరుగుతుంది' అనే విపరీతమైన ఆశాభావంతో ముందడుగు వేస్తారు.

ప్రేమలో కొత్త పిచ్చి! జెన్-జీ ప్రయోగాలు.. రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా ప్రేమలో పడాల్సిందేనా?
Delulu Dating.jpg
Nikhil
|

Updated on: Mar 21, 2026 | 6:25 AM

Share

ప్రేమలో పడటం ఒక ఎత్తు అయితే, విడిపోయిన తర్వాత ఆ బాధ నుండి బయటపడటం మరో ఎత్తు. పాత తరం వారు బ్రేకప్ తర్వాత ఏడ్చి, బాధపడి, తమను తాము దిద్దుకున్నాక గానీ మరో బంధంలోకి అడుగుపెట్టేవారు కాదు. కానీ నేటి జెన్-జీ యువత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. డేటింగ్ ప్రపంచంలో వారు సరికొత్త పదాలను, పద్ధతులను పుట్టిస్తున్నారు. అందులో ఇప్పడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్న ట్రెండ్.. ‘డెలూలు డేటింగ్’. అసలు ఈ వింతైన డేటింగ్ పద్ధతి ఏంటి? దీనివల్ల లాభమా, నష్టమా?

‘డెలూలు డేటింగ్’ అంటే..

ఇది ఒక రకమైన ఊహాలోకపు డేటింగ్. మనకు నచ్చిన వ్యక్తి మన సిద్ధాంతాలకు సరిపోకపోయినా, వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నా.. మనసు చెప్పే హెచ్చరికలను వినకుండా ముందుకు వెళ్లడమే ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం. “నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్” అనే సూత్రంతో వీరు డేటింగ్ చేస్తారు. ‘హౌ ఐ మెట్ యువర్ మదర్’లో బార్నీ లాగా లేదా ‘ఫ్రెండ్స్’లో రాస్ లాగా కాస్త అతిగా ఆలోచించే వారికి, నిరాశలో ఉన్నవారికి ఇది ఒక కొత్త వెలుగులా కనిపిస్తుంది.

ఈ ట్రెండ్‌లో ఫాంటసీ అనేది వాస్తవం కంటే ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తిని కలిసినప్పుడు కలిగే ఉత్సాహం, తోడు దొరికిందనే ఆనందంలో ఎదుటివారు చేసే చిన్నపాటి పనులను కూడా పెద్ద కృషీ లాగా భ్రమపడతారు. నిజానికి వారు ఇచ్చేది ‘బేర్ మినిమమ్’ (కనీస గౌరవం) అయినా, దానిని గొప్ప ప్రేమగా ఊహించుకుంటారు.

ప్రయోజనాలు- పరిమితులు..

  • తక్షణ ఉపశమనం : విఫలమైన ప్రేమ కథల తర్వాత వచ్చే ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ఈ పద్ధతి తక్షణమే సహాయపడుతుంది.
  • స్పష్టత : ప్రతిసారి విఫలమైనా లేదా నిరాశ ఎదురైనా, మీకు ఎలాంటి భాగస్వామి వద్దో అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మీకు ఏది నచ్చదు? దేనిని సహించలేరు? అనేది తెలుసుకోవడానికి ఇదొక ప్రయోగశాల లాంటిది.
  • దీర్ఘకాలిక సమస్యలు : అయితే, ఇది కేవలం స్వల్పకాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. వాస్తవాలను విస్మరించడం వల్ల దీర్ఘకాలంలో మళ్ళీ బ్రేకప్ లేదా చేదు అనుభవాలు తప్పవు.

డేటింగ్ ప్రపంచంలో ‘డెలూలు’ అనేది ఒక ఆసక్తికరమైన మలుపు. జీవితంపై విపరీతమైన ఆశతో, సమస్యలను అప్పటికప్పుడు ఎదుర్కోవాలనుకునే వారికి ఇది నచ్చుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణలో ఉండి, రకరకాల వ్యక్తులను అర్థం చేసుకోవాలనుకుంటే ఈ ‘డెలూలు’ మార్గం మీకు సరిపోవచ్చు. కానీ, భ్రమల కంటే వాస్తవాలు ఎప్పుడూ బలమైనవని గుర్తుంచుకోవాలి!

Follow Us