Hyderabad: నెలరోజుల క్రితమే రెండో బిడ్డకు జన్మనిచ్చింది.. ఇంతలో శృంగారం చేయాలని పట్టుపట్టాడు.. చివరికి!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇటీవల చాలామంది ప్రేమించుకుని, కొంతకాలం రిలేషన్‌లో ఉండి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.

Hyderabad: నెలరోజుల క్రితమే రెండో బిడ్డకు జన్మనిచ్చింది.. ఇంతలో శృంగారం చేయాలని పట్టుపట్టాడు.. చివరికి!
Hyderabad
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 02, 2023 | 9:50 AM

హైదరాబాద్, జూన్ 2: ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇటీవల చాలామంది ప్రేమించుకుని, కొంతకాలం రిలేషన్‌లో ఉండి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పెళ్లి జరిగిన తర్వాత వారి అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ దారుణ ఘటన తాజాగా హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

తనతో శృంగారంలో పాల్గొనలేదన్న కారణంతో ఝాన్సీ అనే మహిళను హత్య చేశాడు భర్త తరుణ్. కొద్దికాలం కిందట ఈ దంపతులిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నెల రోజుల కిందటే రెండో బిడ్డ పుట్టింది. అయితే మే 20న తనతో శృంగారంలో పాల్గొనాలని ఝాన్సీని ఒత్తిడి చేశాడు భర్త తరుణ్. తనకు ఆరోగ్యం బాలేదని.. ఇబ్బంది పెట్టొద్దని ఝాన్సీ ఎన్నిసార్లు చెప్పినా కూడా.. తరుణ్ ఆమె మాట వినకుండా.. బలవంతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అది కాస్తా పెద్ద గొడవగా మారింది. అనంతరం కోపోద్రిక్తుడైన అతడు భార్యను గొంతు నులిమి చంపేశాడు. దాన్ని సహాజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు తరుణ్.

తన భార్య ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేదని.. బంధువులకు సమాచారం అందించి.. ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అక్కడి డాక్టర్లు అప్పటికే ఝాన్సీ మృతి చెందిందని వెల్లడించారు. అయితే ఈలోగా తరుణ్‌ ప్రవర్తనపై అనుమానమొచ్చి.. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఖాకీలు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. మృతురాలి మెడ చుట్టూ గోరు గుర్తులు ఉన్నట్లు నిర్ధారించారు. ఇక పోలీసులు తమదైన శైలిలో తరుణ్‌ను విచారించగా.. తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి రిమైండ్‌కు తరలించారు.