Free Notebooks: తెలంగాణ విద్యార్ధులకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కో విద్యార్ధికి ఫ్రీగా 14 నోట్ బుక్స్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేయనుంది. మొత్తం ఆరు నుంచి 14 వరకు ఉచిత నోట్ బుక్స్ అందించనున్నట్లు..
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేయనుంది. మొత్తం ఆరు నుంచి 14 వరకు ఉచిత నోట్ బుక్స్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గురుకుల విద్యాసంస్థలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, KGBV లలో చదివే విద్యార్ధులందరికీ ఈ మేరకు ఉచిత నోట్ బుక్స్ పంపించనున్నట్లు వెల్లడించింది.
12 లక్షల విద్యార్ధులకు లబ్ధి
దాదాపు రూ.56.24 కోట్ల అంచనా వ్యయంతో 1,17,88,699 నోట్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 6, 7వ తరగతి చదువుతున్న ఒక్కో విద్యార్థికి 200 పేజీలతో కూడిన 6 నోట్ బుక్స్, 8వ తరగతి చదువుతున్న ఒక్కో విద్యార్థికి 7 నోట్‌బుక్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 9వ, పదో తరగతి విద్యార్థులకు 14 నోట్‌బుక్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 12 నోట్‌బుక్స్ అందిస్తారు. ఇప్పటికే అన్ని పాఠశాల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న సర్కార్ నోట్‌బుక్స్ కూడా అందించేందుకు చొరవచూపింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,39,415 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతులకు కూడా..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు నోట్‌బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేయనున్నట్లు విద్యాశాఖ తెల్పింది. రూ.34.70 కోట్ల అంచనా వ్యయంతో 33,82,371 ఉచిత వర్క్‌బుక్‌లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11,27,457 మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.