TSPSC paper leak case: మరో ట్విస్ట్.. ఏకంగా కోచింగ్‌ సెంటర్‌కే ప్రశ్నాపత్రాలు అమ్మకం..50కి చేరిన డీబార్‌లు..

తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 43 మందిని అరెస్టు చేయగా.. 37 మందిని శాశ్వతంగా డీబార్‌ చేశారు. తాజాగా మరో 13 మందిని కూడా భవిష్యత్తులో ఏ నియామక పరీక్షకు కూడా..

TSPSC paper leak case: మరో ట్విస్ట్.. ఏకంగా కోచింగ్‌ సెంటర్‌కే ప్రశ్నాపత్రాలు అమ్మకం..50కి చేరిన డీబార్‌లు..
TSPSC paper leak case
Follow us

|

Updated on: Jun 01, 2023 | 11:23 AM

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 43 మందిని అరెస్టు చేయగా.. 37 మందిని శాశ్వతంగా డీబార్‌ చేశారు. తాజాగా మరో 13 మందిని కూడా భవిష్యత్తులో ఏ నియామక పరీక్షకు కూడా హాజరుకాకుండా కమిషన్‌ డీబార్‌ చేసింది. దీంతో డీబార్ అయిన వారి సంఖ్య 50కి చేరింది.

ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా అరెస్టయిన విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ రమేష్.. పలువురు అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు అమ్మి, వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన సమారు 25 ప్రశ్నపత్రాలను రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు సిట్ అధికారులు తెలిపారు.

వరంగల్‌లో కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్న రమేష్‌ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 20 మంది అభ్యర్ధులకు విక్రయించినట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రమేష్ పాత్రపై సిట్ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. దీనిలో భాగంగా అతని ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులందరి వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం డీబార్ అయ్యేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఏసీ, ఫ్యాన్‌ని నడపడం వల్ల గది త్వరగా చల్లబడుతుందా? ఇందులో నిజమెంత
ఏసీ, ఫ్యాన్‌ని నడపడం వల్ల గది త్వరగా చల్లబడుతుందా? ఇందులో నిజమెంత
55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఫ్లైఓవర్‌ పై నుంచి పల్టీ
55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఫ్లైఓవర్‌ పై నుంచి పల్టీ
10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీల నియామకం.. లిస్ట్ ఇదే..
10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీల నియామకం.. లిస్ట్ ఇదే..
డెలివరీ బాయ్‌కు ఎదురుపడ్డ స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే
డెలివరీ బాయ్‌కు ఎదురుపడ్డ స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే
బెంగళూరు రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. స్పందించిన కొరియోగ్రాఫర్
బెంగళూరు రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. స్పందించిన కొరియోగ్రాఫర్
ద్విచక్ర వాహనాలకూ క్రాష్ టెస్ట్.. రైడర్ల భద్రతకు అధిక ప్రధాన్యం..
ద్విచక్ర వాహనాలకూ క్రాష్ టెస్ట్.. రైడర్ల భద్రతకు అధిక ప్రధాన్యం..
అంత్యక్రియల వేళ అనుకోని విషాదం.. డప్పు కొడుతూ వ్యక్తి మృతి..
అంత్యక్రియల వేళ అనుకోని విషాదం.. డప్పు కొడుతూ వ్యక్తి మృతి..
వ్యాయామం చేసే సమయంలో మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే పద్ధతులు
వ్యాయామం చేసే సమయంలో మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే పద్ధతులు
లేట్ నైట్ తినే అలవాటు ఉందా.. నష్టాలు ఏమిటో తెలుసా..
లేట్ నైట్ తినే అలవాటు ఉందా.. నష్టాలు ఏమిటో తెలుసా..
రెండేళ్లుగా ప్రియుడితో లివ్-ఇన్‌లో ఉన్న యువతి.. సీక్రెట్‌గా.!
రెండేళ్లుగా ప్రియుడితో లివ్-ఇన్‌లో ఉన్న యువతి.. సీక్రెట్‌గా.!