Hyderabad: కొంపముంచిన ఒకే ఒక్క మిస్డ్ కాల్.. రాజేష్‌కి న్యూడ్ ఫొటోస్ పంపిన సుజాత.. అలా చివరకు..
Teacher Sujatha – Rajesh News: ఒక్క.. ఒకే ఒక్క.. మిస్డ్ కాల్‌తో ప్రారంభమైన పరిచయం.. హద్దులు దాటింది.. ఆమెకు 45 ఏళ్లు.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. భర్త, ఇద్దరు పిల్లలున్నారు.. అతనికి 25 ఏళ్లు.. రాంగ్ కాల్‌తో కనెక్టయిన ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగితేలారు..
Teacher Sujatha – Rajesh News: ఒక్క.. ఒకే ఒక్క.. మిస్డ్ కాల్‌తో ప్రారంభమైన పరిచయం.. హద్దులు దాటింది.. ఆమెకు 45 ఏళ్లు.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. భర్త, ఇద్దరు పిల్లలున్నారు.. అతనికి 25 ఏళ్లు.. రాంగ్ కాల్‌తో కనెక్టయిన ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగితేలారు.. ఆమె ఇంట్లో ఈ విషయం తెలిసిన తర్వాత కలిసి బతకలేమని భావించిన ఇద్దరూ.. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, సంచలనం రేపిన టీచర్ సుజాత – రాజేశ్ మృతి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హయత్‌నగర్ కు చెందిన టీచర్ సుజాత, ములుగుజిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చివరకు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం రాంగ్ కాల్ ద్వారా రాజేశ్ – టీచర్ సుజాత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసిందని.. ఇద్దరూ పలు ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.
సుజాతపై రాజేశ్ విపరీతంగా ప్రేమ పెంచుకున్నాడని, సుజాత ఇంటి చుట్టూ రోజూ తిరిగేవాడని పోలీసులు చెప్పారు. రాజేష్, సుజాత ఫోన్లను డీకోడ్ చేసిన పోలీసులు.. గాఢమైన ప్రేమలో మునిగితేలినట్లు గుర్తించారు. ఏడాదిన్నర క్రితం ఇచ్చిన మిస్డ్‌కాల్‌తో కలిసిన ఇద్దరు.. హద్దుదాటి ప్రవర్తించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో సుజాత రాజేష్‌కి న్యూడ్ ఫొటోస్ పంపించిందని.. దీంతో రాజేష్ ప్రతిరోజు కలవాలి, మాట్లాడాలని సుజాతను ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. రాజేష్ ప్రేమలో మునిగిపోయారు. ఈ క్రమంలో సుజాత ఇంట్లో ఈ విషయం తెలియడంతో ఇద్దరూ చనిపోదామనుకున్నారు.
ఈనెల 26న ఇద్దరూ కలిసి పురుగుల మందు కొన్నారు. ఇద్దరూ కలిసి తాగుదామని నిర్ణయించుకున్న తర్వాత.. సుజాత పిల్లలను ఆఖరి సారి చూస్తానని ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అదేరోజు పురుగులమందు తాగి ఆస్పత్రిపాలైంది. ఈ విషయం తెలుసుకుని రాజేష్ 28న పురుగుల మందుతాగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. అయితే, ఈనెల 29న ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సుజాత మృతి చెందగా.. అదేరోజు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాజేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
సిసిటీవీ ఫుటేజీల సహాయంతో ఆధారాలు సేకరించి.. ఈ కేసును చేధించినట్లు పోలీసులు తెలిపారు. మొదట హత్యగా ప్రారంభమైన కేసు.. అనేక మలుపులు తిరిగింది.. చివరకు టీచర్ సుజాత.. రాజేష్ ప్రేమ కథ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..