షాకింగ్‌ ఘటన! మృతి చెందిందని తల్లికి అంత్యక్రియలు.. ఆ మరుసటి రోజే ఇంట్లో ప్రత్యక్షం

'Dead' on arrival after being funeral: మృతి చెందిందని భావించి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆమె కన్న కొడుకులు. కానీ ఆ మరుసటి రోజే తల్లి ప్రాణాలతో ఇంటికి తిరిగి రావడంతో ఒక్కసారిగా ఊరుఊరంతా అవాక్కయ్యింది. తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకున్న..

షాకింగ్‌ ఘటన! మృతి చెందిందని తల్లికి అంత్యక్రియలు.. ఆ మరుసటి రోజే ఇంట్లో ప్రత్యక్షం
Died Woman Returns Home
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 01, 2023 | 10:41 AM

చెన్నై: మృతి చెందిందని భావించి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆమె కన్న కొడుకులు. కానీ ఆ మరుసటి రోజే తల్లి ప్రాణాలతో ఇంటికి తిరిగి రావడంతో ఒక్కసారిగా ఊరుఊరంతా అవాక్కయ్యింది. తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సేలైకండ్రిగ గ్రామానికి చెందిన సొక్కమ్మాల్‌(56)కు ముగ్గురు కుమారులు. సేలై కండ్రిగలో కాపురం ఉంటోన్న చిన్న కుమారుడు శరవణన్‌ వద్ద ఉంటోన్న సొక్కమ్మాల్‌ వారం రోజుల క్రితం ఎదురింటి మహిళతో ఘర్షణ పడింది. ఈ ఘర్షణలో స్వల్పంగా గాయపడింది. దీంతో మనస్తాపానికి గురైన సొక్కమ్మాల్‌ అక్కడి నుంచి చైన్నెలో ఉంటున్న పెద్ద కుమారుడు గాంధీ వద్దకు బయల్దేరింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పచ్చరంగు చీర, ఎరుపు రంగు జాకెట్‌ను ధరించినట్లు తెలిసింది. ఐతే బుధవారం తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రైల్వే ట్రాక్‌పై అదే రంగు దుస్తులతో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ విషయాన్ని పలు దినపత్రికలు ప్రచురించాయి. ఆ వార్తలను చూసి మృతి చెందిన వృద్ధురాలు సొక్కమ్మాల్‌గా భావించిన ఆమె చిన్నకుమారుడు శరవణన్‌ రైల్వే పోలీసులను సంప్రదించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం చైన్నెలో ఉన్న అతని అన్న గాంధీకి సమాచారం ఇవ్వడానికి ఫోన్‌ చేయగా.. గత కొన్నేళ్లుగా గాంధీకి, శరవణన్‌కు మధ్య మాటలు లేకపోవడంతో గాంధీ ఫోన్‌ లిప్ట్‌ చేయలేదు. దీంతో చేసేదిలేక మే 28న అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరుసటి రోజే అంటే సోమవారం ఉదయం సొక్కమ్మాల్‌ ప్రాణాలతో శరవణన్‌ ఇంటికి రావడంతో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా మంగళవారం మృతదేహాన్ని వెలికి తీసి డీఎన్‌ఏ టెస్టు నిర్వహించారు. మృతురాలు రెడ్‌హిల్స్‌కు చెందిన ఏలుమలై భార్య శకుంతలమ్మాల్‌ (66)గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.