BJP Chief Annamalai on Ravindra Jadeja: భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీజేపీ కార్యకర్త అని తమిళనాడులోని ఆ పార్టీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని..
BJP Chief Annamalai on Ravindra Jadeja: భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీజేపీ కార్యకర్త అంటూ తమిళనాడులోని ఆ పార్టీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని రవీంద్ర జడేజా అనూహ్యరీతిలో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అన్నామలై నేతృత్వంలోని తమిళనాడు బీజేపీ ఓ ట్వీట్ చేసింది. అందులో ‘జడేజా బీజేపీ కార్యకర్త. అతని భార్య రివాబా జడేజా గుజరాత్‌లోని జామ్‌నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే. అతను(జడేజా) గుజరాతీ. బీజేపీ కార్యకర్త జడేజా మాత్రమే సీఎస్‌కేకు విజయాన్ని అందించారు’ అంటూ బీజేపీ రాసుకొచ్చింది. ఇంకా గుజరాత్ మోడల్‌పై ద్రవిడ మోడల్ సాధించిన విజయంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుపును అభివర్ణిస్తూ బీజేపీని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్న నేపథ్యంలో అన్నామలై నుంచి ఈ విధమైన రియాక్షన్ వచ్చింది.
கிரிக்கெட் வீரர் ஜடேஜா ஒரு பாஜக காரியகர்த்தா. அவர் மனைவி திருமதி.ரிவபா ஜாம்நகர் வடக்கு தொகுதி பாஜக சட்டமன்ற உறுப்பினர். மேலும் அவர் குஜராத்காரர்!
అలాగే ఓ టెలివిజన్ ఛానెల్‌కు చెందిన యాంకర్‌తో అన్నామలై మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై టీమ్ గెలిచినందుకు గర్వపడుతున్నప్పటికీ, CSK కంటే ఎక్కువ మంది తమిళులు గుజరాత్ టీమ్‌లోనే ఎక్కువగా ఉన్నందున ప్రజలు గుజరాత్ టైటాన్స్(GT) గురించి కూడా సంబరాలు జరుపుకోవాలని అన్నారు. ‘ఒక తమిళియన్ (సాయి సుదర్శన్) 96 పరుగులు చేసాడు, మేము దానికి కూడా సంబరాలు జరుపుకుంటాము. చెన్నై టీమ్ తరఫున తమిళులెవరూ ఫైనల్ ఆడలేదు కానీ ధోని కారణంగా మేము ఇప్పటికీ జట్టుకు మద్ధతుగా ఉంటాము. బీజేపీ కార్యకర్త గెలుపు బాట పట్టడం మాకు గర్వకారణం’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు జడేజా అధికారికంగా బీజేపీలో చేరాడా లేదా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, 2019లో ఆ పార్టీకి మద్ధతు పలుకుతున్నానని ట్వీట్ చేశాడు.
కాగా, మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోర్ చేశాడు. అయితే చెన్నై బ్యాటింగ్ ఇన్నింగ్స్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో, D/L పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. ఈ మేరకు 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అలా చెన్నై తరఫున డెవాన్ కాన్వే (25 బంతుల్లో 47 పరుగులు), శివమ్ దుబే(21 బంతుల్లో 32) రాణించారు. ఈ క్రమంలో చివరి ఓవర్లో 13 పరుగులు కావలసిన సమయంలో తొలి 4 బంతులకు 3 పరుగులే వచ్చాయి. అంటే చివరి రెండు బంతుల్లో చెన్నైకి 10 పరుగులు అవసరం. ఇక అప్పుడే జడేజా విజృంభించాడు. చివరి 2 బంతుల్లో 6, 4 కొట్టి చెన్నై జట్టు 5వ ట్రోఫీ గెలుచుకునేలా చేశాడు.