WTC Final: ఐపీఎల్ ‘ఎమర్జింగ్ ప్లేయర్’కి కింగ్ కోహ్లీ బ్యాటింగ్ పాఠాలు.. వైరల్ అవుతున్న ప్రాక్టీస్ సెషన్ వీడియో..
WTC Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ మీదకు చేరింది. జూన్ 7-11 మధ్య జరిగే డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో రోహిత్ సేన తలపడనున్న..
WTC Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ మీదకు చేరింది. జూన్ 7-11 మధ్య జరిగే డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో రోహిత్ సేన తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లంతా ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుని ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ తరఫున విజృంభించిన ‘ఎమర్జింగ్ ప్లేయర్’ యశస్వీ జైస్వాల్ కూడా భారత్ జట్టులో భాగంగా ఇంగ్లాండ్‌కు చేరకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ చేస్తున్న యశస్వీకి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో విశేషమేమిటంటే టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎలా చేయాలో యశస్వీకి చిట్కాలు ఇస్తున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్‌గా జైస్వాల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు విరాట్ కోహ్లీతో పాటు ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ప్లే ఆఫ్‌లో ముంబై ఓడిపోవడంతో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జైస్వాల్ కలిసి ముందుగానే లండన్ చేరిన సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్ ముగిసిపోవడంతో మిగిలిన ప్లేయర్లు కూడా లండన్‌లోని అరండేల్ క్యాజిల్ క్రికెట్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తూ కొత్త వాతావరణానికి తగ్గట్టుగా మారుతున్నారు. ఈ జట్టులో అజింక్యా రహానే కూడా ఉండడం విశేషం. కోహ్లీ నేతృత్వంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ చాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో రహానే కూడా భారత్ తరఫున ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Virat Kohli giving tips to Yashasvi Jaiswal in the practice session.
King Kohli always there for youngsters! pic.twitter.com/LGMPqX29NW
— CricketMAN2 (@ImTanujSingh) May 31, 2023
WTC ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, KS భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..