IPL 2023 Trophy: శ్రీవారి పాదాల సన్నిధిలో ఐపీఎల్ ట్రోఫీ.. ప్రత్యేక పూజలు చేయించిన చెన్నై సూపర్ కింగ్స్..
IPL 2023 Trophy: గుజరాత్ టైటాన్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించి ఐపీఎల్ 2023 విజేతగా, 5వ సారి ట్రోఫీ విన్నర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ మేనెజ్‌మెంట్ సభ్యులు మంగళవారం....

IPL 2023 Trophy: గుజరాత్ టైటాన్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించి ఐపీఎల్ 2023 విజేతగా, 5వ సారి ట్రోఫీ విన్నర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ మేనెజ్‌మెంట్ సభ్యులు మంగళవారం.. ఐపీఎల్ టైటిల్‌తో చెన్నైలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రోఫీని ఆ కళియుగ ప్రత్యక్ష దైవం అయిన వేంకటేశ్వరుని పాదాల చెంత ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించారు. గతంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా అధినేత్రి నీతా అంబానీ కూడా శ్రీ కృష్ణుడి ఆలయానికి ట్రోఫీని తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్ గెలవడం ఆ స్వామివారి కృపతోనే సాధ్యమైందని నమ్ముతొన్న సీఎస్‌కే మేనేజ్‌మెంట్ సభ్యులు.. అహ్మదాబాద్ నుంచి తిరిగి రాగానే దైవదర్శనానికి వెళ్లారు. టీ నగర్‌లోని తిరుపతి ఆలయంలో ఐపీఎల్ ట్రోఫీకి పూజలు నిర్వహిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చెన్నై మేనేజ్‌మెంట్ ఐపీఎల్ ట్రోఫీతో గుడికెళ్లడం అనవసరం అని కొందరు భావిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. చెన్నై జట్టు ఈసారి ఫేవరేట్స్ కానప్పటికీ.. టైటిల్ నెగ్గిందని గుర్తు చేస్తున్నారు. గత సీజన్‌లో ధోనీ సేన పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచినా.. తాజా సీజన్‌లో విన్నర్‌గా నిలిచిందంటున్నారు.




CSK management did Special Pooja with IPL Trophy at Tirupati Temple in T Nagar, Chennai.pic.twitter.com/MLCsYKAYJK
— CricketGully (@thecricketgully) May 30, 2023
ధోని సేన గురించి మాట్లాడుకుంటే.. ఒకరికి తీసిపోకుండా మరొకరు రాణించారు. బ్యాటింగ్‌లో రుతురాజ్, డెవాన్ కాన్వే ముందుండి జట్టును నడిపించారు. ముఖ్యంగా రహానే పాత్ర ప్రశంసనీయం. అలాగే మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, శివమ్ దుబే కీలక సమయాల్లో మెరుపులు మెరిపించారు. టీమ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఫైనల్ మ్యాచ్‌లో 2 బంతులకు 10 పరుగులు అవసరమైన కీలక సమయంలో సమయస్ఫూర్తితో జట్టును విజయతీరాలకు చేర్చాడు. బౌలింగ్‌లో తీక్షణ, పతిరాన, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ లాంటి యువ బౌలర్లు మంచి ప్రదర్శన కనబర్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..