Andhra Pradesh: అందుకే టీడీపీ మహానాడు.. చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Kodlai Nani On Chandra Babu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత బాబుకి లేదని, వేడుకల పేరుతో తనను అందరూ..

Andhra Pradesh: అందుకే టీడీపీ మహానాడు.. చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
Kodali Nani On Chandra Babu
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 29, 2023 | 12:20 PM

Kodlai Nani On Chandra Babu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత బాబుకి లేదని, వేడుకల పేరుతో తనను అందరూ పొగిడేలా చేస్తున్నారంటూ నాని తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ‘‘చంద్రబాబును పొగిడించడానికే మహానాడు పెట్టారు. మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్‌ బొమ్మ ఎలా పెడతారు. ఎన్‌టీఆర్‌ పేరుతో 4 ఓట్లు సంపాదించుకోవడం కోసమే ఈ తపనంతా. ప్రశ్నిస్తానంటూ వచ్చిన జనసేన పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకు ఓటేయించార’’ని అన్నారు.

ఇంకా 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నిర్వహించలేదని, అంతకముందు వైయస్సార్ ఇచ్చిన ప్రతీ హామీని నెలవేర్చారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని పథకాలను కూడా ప్రవేశపెట్టారని, 2019లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారని అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదనన్నారు. అంతేకాకుండా చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లు పూర్తవక ముందే రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదంటున్నారని, మరి 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదంటూ నాని ప్రశ్నించారు.

‘‘ఈ హామీలే కాక బీసీలకు చట్టం తెస్తానని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారు. వాస్తవానికి చంద్రబాబు వెనుక బీసీలెవరూ లేరు. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మాత్రమే. వీళ్లెవరూ బీసీలు కాదు.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారు. చంద్రబాబును ‘ఆల్‌ఫ్రీ బాబు’ అని వైఎస్సార్‌ ఆనాడే చెప్పారు. ‘చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు’ అని ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారు. చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎంత ఇచ్చాడు..? రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా..? టీడీపీ హయాంలో లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు’ అంటూ నాని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..