WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి రుతురాజ్ ఔట్.. జట్టులోకి వచ్చిన ఐపీఎల్ సెంచరీ ప్లేయర్.. కారణం ఏమిటంటే..?
WTC Final 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చెలరేగిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్‌కి జాతీయ జట్టులోకి పిలుపు వచ్చింది. జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా..
WTC Final 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చెలరేగిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్‌కి జాతీయ జట్టులోకి పిలుపు వచ్చింది. జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అంతకముందు ఎంపికైన రుతురాజ్ గైక్వాత్ స్థానాన్ని జైశ్వాల్ భర్తీ చేశాడు. ‘రుతురాజ్ తన వివాహం కారణంగా అందరితో కలిసి ఇంగ్లాండ్‌కి రాలేనని, జూన్ 5 నాటికి జట్టులోకి చేరగలనని మాకు తెలిపాడు. కానీ రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేయమని సెలెక్టర్లను టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోరాడు. దీంతో జైశ్వాల్‌ని రుతురాజ్ స్థానంలో తీసుకున్నారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్‌లో యశస్వీ జైశ్వాల్ రాజస్థాన్ తరఫున రాజస్థాన్ టీమ్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడి మొత్తం 625 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్థసెంచరీలు.. ఒక శతకం కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ 163.61, బ్యాటింగ్ యావరేజ్ 48.07గా ఉన్నాయి. అంతకు మించి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన 4వ ఆటగాడిగా.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతలా రాణించిన జైశ్వాల్‌కి WTC Final కోసం పిలుపు రావడం సంతోషకర విషయమని పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
Yashasvi Jaiswal set to replace Ruturaj Gaikwad in the Standby lists for India in the WTC Final.
Gaikwad will be getting married. (Reported by Indian Express). pic.twitter.com/dIf1n0aEAi
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2023
కాగా, WTC Final కోసం ఎంపికైన ప్లేయర్లలో విరాట్ కోహ్లీతో సహా కొందరు ఇప్పటికే లండన్ చేరుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ రోజు బయలుదేరతారు. ఇక ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న మొహమ్మద్ షమి, రవీంద్ర జడేజా, శుభమాన్ గిల్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఈ నెల 30న స్టార్ట్ అవుతాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..