Telangana: అబార్షన్, లింగ నిర్ధారణ పరీక్షల గుట్టు రట్టు.. పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌లో 18 మంది అరెస్ట్..

వరంగల్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు, ఆబార్షన్లు చేస్తున్న హైటెక్ వైద్యుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసు అధికారులు. వరంగల్ లోటస్ ఆస్పత్రి, గాయత్రి ఆస్పత్రి.. నర్సంపేటలో బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..

Telangana: అబార్షన్, లింగ నిర్ధారణ పరీక్షల గుట్టు రట్టు.. పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌లో 18 మంది అరెస్ట్..
sting Operation On Gender Tests, Illegal Abortions in Warangal
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 29, 2023 | 1:23 PM

వరంగల్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు, ఆబార్షన్లు చేస్తున్న హైటెక్ వైద్యుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసు అధికారులు. వరంగల్ లోటస్ ఆస్పత్రి, గాయత్రి ఆస్పత్రి.. నర్సంపేటలో బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు స్టింగ్ ఆపరేషన్‌తో పక్కా ప్లాన్ వేసుకొని రంగంలోకి దిగారు. ఈ మేరకు ఓ మహిళ(లేడీ ఎస్సై)కు ఆబార్షన్ చేయాలంటూ వెళ్లి వైద్యుల ముఠాను సాక్ష్యధారాలతో సహా పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇప్పవరకు మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు గైనకాలజిస్ట్ డాక్టర్లు, ల్యాబ్స్ నిర్వాహకులు ఉన్నట్లుగా గుర్తించారు. వీరే కాక స్థానికంగా 100 మందికి పైగా RMP డాక్టర్లు కూడా ఈ రాకెట్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు.

తమ వద్దకు వచ్చిన గర్భిణీలకు లింగ నిర్ధారణ పరిక్షలు జరిపి.. కడుపులో అమ్మాయి అని తేలితే అబార్షన్లు చేస్తున్నారని, ఒక్కొక్కరి నుంచి 30 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలింది. అబార్షన్ కోసం వచ్చినవారు పెళ్లికాని వారైతే లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని, అనుమతి లేని ఆస్పత్రుల్లోనూ అబార్షన్లు చేస్తున్నారని స్టింగ్ ఆపరేషన్ కండక్ట్ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. గర్భస్థ పిండం లింగ నిర్ధారణ పరీక్షలు ఎవరు చేసినా చట్టరీత్యా చర్య తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని పోలీసు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..