Watch Video: నడుము ఊపుతూ నాట్యం చేసిన పిల్లి.. వైరల్ అవుతున్న బెల్లీ డ్యాన్స్ వీడియో..

Cat's Belly Dance: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలా వైరల్ అయ్యే వీడియోలలో డ్యాన్స్‌కి సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక సహజంగానే చాలా మందికి డ్యాన్స్ చేయడమన్నా, చూడడమన్నా ఎంతో..

Watch Video: నడుము ఊపుతూ నాట్యం చేసిన పిల్లి.. వైరల్ అవుతున్న బెల్లీ డ్యాన్స్ వీడియో..
Cat's Belly Dance
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 29, 2023 | 7:16 AM

Cat’s Belly Dance: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలా వైరల్ అయ్యే వీడియోలలో డ్యాన్స్‌కి సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక సహజంగానే చాలా మందికి డ్యాన్స్ చేయడమన్నా, చూడడమన్నా ఎంతో ఇష్టం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆయా వైరల్ వీడియోల్లోని డ్యాన్స్ స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ కాలు కదిపేవారు కూడా లేకపోలేదు. తాజాగా ఓ పిల్లి కూడా తన కాలునే కాక నడుమును కూడా ఊపుతూ నాట్యం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పెట్ లవర్స్‌ని కనువిందు చేస్తోంది.

ఆ వీడియోలో తన ఓనర్ సహాయంతో రెండు కాళ్లపై నిలబడిన ఓ పిల్లి చక్కగా నడుము ఊపుతూ బెల్లీ డ్యాన్స్ చేస్తోంది. డ్యాన్స్ చేయడం కోసం సదరు పిల్లి చక్కగా కాస్ట్యూమ్స్‌ని కూడా ధరించి, ఆలకరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను, స్టిక్కర్లను కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు 16 లక్షల 83 వేలకు పైగా లైకులు, 2 కోట్ల 82 లక్షల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..