Watch Video: ఎంతకు తెగించార్రా..! పెంపుడు కుక్కకు బేబీ కటింగ్.. ప్రేమ ఉంటే మాత్రం ఇంతలా చేయాలా..?

Dog's Baby Cutting: అందమైన జుట్టు, దానికి చక్కని హెయిర్ స్టైల్ ఉండాలని ఎవరు మాత్రం కోరుకోకుండా ఉంటారు..! అందుకే కొందరు నిత్యం ట్రెండీ హెయిర్ కటింగ్స్ చేయించుకుంటుంటారు. ఆ తర్వాత తమ కొత్త హెయిర్ స్టైల్‌కి సంబంధించిన..

Watch Video: ఎంతకు తెగించార్రా..! పెంపుడు కుక్కకు బేబీ కటింగ్.. ప్రేమ ఉంటే మాత్రం ఇంతలా చేయాలా..?
Dogs Baby Cutting
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 29, 2023 | 11:02 AM

Dog’s Baby Cutting: అందమైన జుట్టు, దానికి చక్కని హెయిర్ స్టైల్ ఉండాలని ఎవరు మాత్రం కోరుకోకుండా ఉంటారు..! అందుకే కొందరు నిత్యం ట్రెండీ హెయిర్ కటింగ్స్ చేయించుకుంటుంటారు. ఆ తర్వాత తమ కొత్త హెయిర్ స్టైల్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్క కూడా తన హెయిర్ స్టైల్‌ని చూయిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు సదరు పెంపుడు కుక్క ఓనర్. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆ వైరల్ వీడియోలో ఓ పెంపుడు కుక్క బేబీ కటింగ్ హెయిర్ స్టైల్ చేయించుకుని ఉండడం, అది కెమెరాకు ఫోజులు ఇవ్వడాన్ని మీరు చూడవచ్చు. ‘నాకేం తెలియదు’ అన్నట్లుగా అది ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా మీరు గమనించవచ్చు. అందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Hola (@hola__chill7)

మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. సదరు పెంపుడు కుక్క చూడడానికి ఎంతో అందంగా ఉందని, అలాంటి హెయిర్ కటింగ్ చేసిన పెట్ ఓనర్‌ నిజంగా ఓ అద్భుతం అంటూ రాసుకొస్తున్నారు. ఇంకా ఈ వీడియోకు ఇప్పటివరకు వేలల్లో లైకులు, లక్షల్లో వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..