Gold Robbery: సింకింద్రాబాద్ ‘బంగారం చోరీ’ దొంగలు ఆ రాష్ట్రానికి పరార్‌..! రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..

సికింద్రాబాద్‌ బంగారం చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడినవారిని మహారాష్ట్ర గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు...

Gold Robbery: సింకింద్రాబాద్ ‘బంగారం చోరీ’ దొంగలు ఆ రాష్ట్రానికి పరార్‌..! రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
Gold Robbery
Follow us

|

Updated on: May 29, 2023 | 7:46 AM

ఐటీ అధికారుల ముసుగులో సికింద్రాబాద్ మార్కెట్‌ పీఎస్ పరిధిలోని జ్యూవెలరీషాపులో జరిగిన చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోండా మార్కెట్‌లోని మధుకర్ అనే వ్యాపారికి చెందిన షాపులో ఐటీ అధికారులమని నమ్మించి 1700 గ్రాముల బంగారంతో ముఠా ఉడాయించింది. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో పాటు టాస్క్​ఫోర్స్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. నిందితులు మహారాష్ట్ర గ్యాంగ్‌గా అనుమానిస్తున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు కొన్ని బృందాలు మహారాష్ట్రకు వెళ్లాయి.

అంతకముందు నిందితులు చోరీ తర్వాత ఆటోలో జేబీఎస్‌ వెళ్లిన ముఠా అక్కడి నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. పటాన్‌చెరు మీదుగా మహారాష్ట్ర వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన చోట వందల జ్యూవెలరీ దుకాణాలు ఉండగా..నాలుగో అంతస్తులోని మధుకర్​నగలషాపుకే వెళ్లడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో షాపు యాజమాని మధుకర్ తన సొంతూరు షోలాపూర్‌లో ఉన్నాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని హైదరాబాద్‌కు పిలిపించి విచారిస్తున్నారు. గతంలో అక్కడ పని చేసిన వర్కర్ల వివరాలను సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే బంగారం చోరీ చేశారని పోలీసులు చెబుతున్నారు.

మోండా మార్కెట్‌లో ఉన్న బంగారం దుకాణానికి ఐదుగురు వ్యక్తులు సూటు బూటు ధరించి వచ్చి ఆఫీసర్లలాగా కటింగ్​ ఇస్తూ.. గోల్డ్​ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారంటూ షాపులోని సిబ్బందిని బెదిరించారు. షాపులో అటూ ఇటూ తిరుగుతూ హడివుడి చేస్తూ అక్కడ ఉన్న సిబ్బందిని పక్కకి వెళ్లగొట్టారు. అనంతరం షాపులో ఉన్న గోల్గ్‌ని పరిశీలిస్తూ.. సోదాలు చేస్తున్నట్లు నటిస్తూ.. 1.7కిలోల బంగారానికి సంబంధించి ట్యాక్స్ కట్టలేదని..అందుకే ఆ గోల్డ్​ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండానే బంగారంతో ఉడాయించారు. సిబ్బందిని షాపులోనే ఉంచి తలుపులు వేసి వెళ్లారు. ఈ ఘటనతో ఖంగుతిన్న సిబ్బంది తమ యాజమాని మధుకర్‌కి తెలపడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే వచ్చింది నకిలీ ఐటీ అధికారులని గుర్తించిన పోలీసులు.. లోతుగా విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో