AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తండ్రికి కూతురే కొడుకు.. తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించిన తనయ

ప్రతి తండ్రి తన అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకు ను వారసుడుగా కోరుకుంటారు. కానీ కొడుకు కంటే కూతురు తక్కువేం కాదు అంటూ...కూతురే కొడుకై తండ్రి కి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

Telangana: తండ్రికి కూతురే కొడుకు.. తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించిన తనయ
daughter perform final rituals
Surya Kala
|

Updated on: May 29, 2023 | 7:26 AM

Share

ప్రతి తండ్రి తన అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకును వారసుడిగా కోరుకుంటాడు. అయితే.. కొడుకు కంటే కూతురేం తక్కువ కాదంటూ.. కూతురే కొడుకై తండ్రికి తల కొరివి పెట్టింది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ. తండ్రికి తలకొరివి పెట్టి ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచమంతా టెక్నాలజీలో జెట్‌ స్పీడ్‌తో ముందుకెళ్తున్నా సమాజంలో స్త్రీ, పురుష బేధభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు.. ఉద్యోగం.. టెక్నాలజీలో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్నా.. పితృకర్మల విషయాల్లో స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి.. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. కానీ.. ఇప్పుడు.. కొంతమంది మహిళల్లో మార్పులొస్తున్నాయి. అలాంటి కట్టుబాట్లకు చెక్‌ పెడుతున్నారు. మగపిల్లలను కన్నట్లుగానే ఆడపిల్లలను కన్నారు.. అలాంటప్పుడు.. తామెందుకు చేయకూడదంటూ తల్లిదండ్రుల కర్మకాండలు నిర్వహిస్తున్నారు.

తాజాగా.. ఖమ్మం జిల్లాలోనూ తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి ప్రశంసలు అందుకున్నారు బండి వెంకటనర్సమ్మ అనే మహిళ. వేంసూరుకు చెందిన బింగి నారాయణ అనే వృద్ధుడు కొడుకులు లేకపోవడంతో పెనుబల్లిలోని కూతురు వద్ద జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి అన్నీ తానై సపర్యలు చేసింది. ఈ క్రమంలోనే.. వృద్ధాప్యంతో కూతురు ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు తండ్రి నారాయణ. అయితే.. కొడుకులు లేకపోవడంతో నారాయణ అంత్యక్రియలు కూతుళ్లు, అల్లుళ్లే నిర్వహించారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి.. కూతురే కొడుకుగా మారి.. తండ్రికి తలకొరివి పెట్టింది వెంకటనర్సమ్మ. దాంతో.. కొందరు ఆశ్చర్యపోయినప్పటికీ.. రోజులు మారుతున్నప్పుడు.. సంప్రదాయాలు కూడా మారాల్సిన అవసరముందంటూ ఆమెకు అండగా నిలిచి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు గ్రామస్తులు. తండ్రికి తలకొరివి పెట్టిన కూతుర్ని అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు