NTR Statue: ఎన్టీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా దుర్యోధన విగ్రహానికి ఘన నివాళులు.. శ్రీ కృష్ణ విగ్రహావిష్కరణ నిలిపివేతపై అభ్యంతరం..

ఎన్ టి ఆర్ శత జయంతి సందర్భంగా దుర్యోధనుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కృష్ణుడి వేషాధరణలో ఉన్న ఎన్ టి ఆర్ విగ్రహ ఆవిష్కరణకు అడ్డుకోవడాన్ని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

NTR Statue: ఎన్టీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా దుర్యోధన విగ్రహానికి ఘన నివాళులు.. శ్రీ కృష్ణ విగ్రహావిష్కరణ నిలిపివేతపై అభ్యంతరం..
Ntr Statue
Follow us

|

Updated on: May 28, 2023 | 1:45 PM

ఖమ్మం లో శ్రీకృష్ణుడి విగ్రహ వివాదం నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్ టి ఆర్ అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.. ఎన్ టి ఆర్ శత జయంతి సందర్భంగా సాలూరు లో ఉన్న దుర్యోధనుడి విగ్రహాన్ని సుందరంగా అలంకరించారు. దానవీరశూరకర్ణ సినిమాలోని ఎన్ టి అర్ పాత్రధారణ లోని ఎన్ టి ఆర్ విగ్రహాన్ని 1999 లో నందమూరి హరికృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఎన్ టి ఆర్ అభిమానులు.. అప్పటి నుండి పలు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు.. ఎన్ టి ఆర్ శత జయంతి సందర్భంగా ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కృష్ణుడి వేషాధరణలో ఉన్న ఎన్ టి ఆర్ విగ్రహ ఆవిష్కరణకు అడ్డుకోవడాన్ని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ఆవిష్కరణ ను కులం పేరుతో నిలిపివేయడం తగదని అంటున్నారు . ఆయనను అభిమానులు పలు రకాల క్యారెక్టర్స్ తో ఊహించుకొని ఆరాధిస్తారని అంటున్నారు.

కృష్ణుడు రూపంలో ఎన్ టి ఆర్ విగ్రహం తప్పైతే ప్రతిపక్ష పాత్రలో ఉన్న కౌరవ రాజు దుర్యోధనుడి విగ్రహాన్ని నెలకొల్పడం కూడా తప్పేనని అంటున్నారు.. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, శివుడు వంటి అనేక రూపాల్ని ప్రజలకు పరిచయం చేసిన ఎన్ టి ఆర్ ను ఒక కులానికి, ఒక మతానికి పరిచయం చేయడం తగదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..