AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు. మా భూములు మాకివ్వండి అంటూ రైతుల ఆందోళన.. ఎడ్ల బండ్లతో మహిళలు భారీ ర్యాలీ

ఆదిలాబాద్‌ జిల్లాలో రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ భూనిర్వాసితులు ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. భూములు తిరిగి ఇచ్చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ చేపట్టారు. భూనిర్వాసితులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జీవో నెంబర్ 40 ప్రకారం మూడు ఏళ్లలో ప్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు పరిశ్రమ పనులు ప్రారంభించలేదని ఆందోళన చేశారు. 

Adilabad: సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు. మా భూములు మాకివ్వండి అంటూ రైతుల ఆందోళన.. ఎడ్ల బండ్లతో మహిళలు భారీ ర్యాలీ
Renuka Cement Factory
Surya Kala
|

Updated on: May 28, 2023 | 7:53 AM

Share

ఆదిలాబాద్ జిల్లా రాంపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలని పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా బీజేపీ నేత సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో ఫ్యాక్టరీ భూముల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా.. సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. భూ నిర్వాసితులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకోవడానికి అనుమతినివ్వాలని ఆందోళనకారులు పోలీసులను కోరారు. జీవో నెంబర్ 40 ప్రకారం మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు.

రేణుక‌ సిమెంట్ ఫ్యాక్టరీ భూనిర్వాసితుల పోరాటంలో తుడుందెబ్బ ఎంట్రీ ఇచ్చింది. ఆదివాసీల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు ఆదిలాబాద్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేష్. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమోటోగా తీసుకోని కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు తుడుందెబ్బ నేతలు.

అలాగే.. రేణుక సిమెంట్ భూ నిర్వాసితుల అరెస్ట్‌పై ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుక సిమెంట్ లీజును రద్దు చేసి.. ఎవరిభూములు వారికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దయెత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రేణుక ఫ్యాక్టరీ యాజమాన్యంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమ్మక్కై ఆదివాసీలను నిండా ముంచారని ఆరోపించారు ఎంపీ సోయం బాపురావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..