Plastic Rice in Medak: మెదక్‌ జిల్లాలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం.. ఫోర్టిఫైడ్‌ రైస్‌గా తేల్చిన అధికారులు

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపాయి. రాజిపేటలో రేషన్‌ షాప్‌ డీలర్‌ సరఫరా చేసిన బియ్యం ప్లాస్టిక్‌ రైస్‌లా ఉండటంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే.. అవి ప్లాస్టిక్‌ రైస్‌ కాదని.. ఫోర్టిఫైడ్‌ రైస్‌ అని క్లారిటీ ఇచ్చారు అధికారులు.

Plastic Rice in Medak: మెదక్‌ జిల్లాలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం.. ఫోర్టిఫైడ్‌ రైస్‌గా తేల్చిన అధికారులు
Plastic Rice In Medak
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2023 | 7:00 AM

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటలో కొద్దిరోజుల క్రితం ఓ రేషన్‌ షాప్‌ డీలర్‌ బియ్యం సరఫరా చేశారు. ఆ రేషన్‌ బియ్యం వెరైటీగా ఉండటంతో గ్రామస్తులు కంగారు పడిపోయారు. రేషన్‌ బియ్యంలోని వెరైటీ గింజలను వేరు చేసి.. నీటిలో నానబెట్టటంతో మెత్తగా పిండిపిండిగా మారాయి. ప్లాస్టిక్‌ ముద్దలా తయారవటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ప్లాస్టిక్‌ బియ్యం తిని బతకాలా చావాలా అంటూ మండిపడ్డారు. గత కొన్నిరోజులుగా ఇదే బియ్యం పిల్లలకు వండిపెడుతున్నామని చెప్పిన గ్రామస్తులు.. ఇలాంటివి తింటే ఆరోగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అయితే.. మెదక్‌ జిల్లాలోని ప్లాస్టిక్‌ బియ్యం ప్రచారంతో అధికారులు అలెర్ట్‌ అయ్యారు. దానిపై మండల అధికారులతోపాటు.. రేషన్‌ షాపు డీలర్‌ను ఆరా తీశారు.

ఆపై.. కౌడిపల్లి మండలం రాజిపేట గ్రామంలో కలకలం రేపిన ప్లాస్టిక్ బియ్యం వ్యవహారంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అవి ప్లాస్టిక్‌ రైస్‌ కాదని.. ఫోర్టిఫైడ్‌ రైస్‌ అని తేల్చారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించే క్రమంలో.. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాల్సిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ను రేషన్‌ డీలర్‌ పొరపాటున ప్రజలకు సరఫరా చేశారని తెలిపారు. అవి తినటం వల్ల ఎలాంటి ఇబ్బందులుండవని చెప్పారు. వాస్తవానికి.. పేదలకు పోషకాలు అందేలా కొన్నాళ్లుగా రేషన్​లో ఫోర్టిఫైడ్ రైస్‌ పంపిణీ చేస్తోంది కేంద్రం. పైలెట్​ ప్రాజెక్ట్ కింద పలు జిల్లాలను ఎంపిక చేసింది.

అయితే.. ఫోర్టిఫైడ్ రైస్‌పై ప్రజలకు అవగాహన లేక వాటిని తినటం మానేస్తున్నారు. మరికొందరు.. ప్లాస్టిక్‌ బియ్యమంటూ కంగారుపడిపోతున్నారు. రేషన్‌ బియ్యంలో ఫోర్టిఫైడ్​ రైస్ గింజలు తేలికగా వేరే రంగులో ఉండడం, అన్నం ముద్దగా అవుతుండటంతో అవి ప్లాస్టిక్ బియ్యమనుకొని వండుకోవడానికి వెనకాడుతున్నారు. కానీ.. ఫోర్టిఫైడ్‌ రైస్‌లో విరివిగా పౌష్టికాలు ఉంటాయని చెప్తున్నారు అధికారులు. మొత్తంగా.. కేంద్రం సప్లై చేస్తున్న ఫోర్టిఫైడ్ ​రైస్ గురించి, వాటిలోని పోషక విలువల గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!