NTR Birth Anniversary: చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. అందుకే తారక్‌ ఎన్టీఆర్‌ ఫంక్షన్‌కు హాజరుకాలేదంటూ..

విజయవాడ బెంజిసర్కిల్‌లో ఎన్టీఆర్ శతజయంతి సభ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్యర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని కృష్ణమురళీ, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

NTR Birth Anniversary: చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. అందుకే తారక్‌ ఎన్టీఆర్‌ ఫంక్షన్‌కు హాజరుకాలేదంటూ..
Director Ram Gopal Varma
Follow us
Basha Shek

|

Updated on: May 28, 2023 | 1:21 PM

విజయవాడ బెంజిసర్కిల్‌లో ఎన్టీఆర్ శతజయంతి సభ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్యర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని కృష్ణమురళీ, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు పోసాని కృష్ణమురళి చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ‘ఎన్టీఆర్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన నెంబర్‌ వన్‌ హీరో అని అందరికీ తెలుసు. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు.చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు’ అని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు పోసాని. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడంపై ఆర్జీవీ స్పందించారు. తారక్‌కి థ్యాంక్స్ చెప్పారు ఆర్జీవీ . ఎన్టీఆర్ ..లక్ష్మీపార్వతి మాయలో పడ్డారని చెప్పే టీడీపీ నేతలు.. ఎన్టీఆర్‌ను ఎందుకు పూజిస్తున్నారంటూ ప్రశ్నించారు ఆర్జీవీ. అలాగే చంద్రబాబుపై కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముసలి, పాముతో పొల్చారు ఆర్జీవీ. ‘నేను ఒక జోక్‌ చెప్పడానికి విజయవాడకు వచ్చాను. రాజమండ్రిలో ఆ జోక్‌ జరుగుతోంది (టీడీపీ మహానాడును ఉద్దేశించి). నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క వారసుడు తారక్‌. వాళ్ల పక్కన కూర్చోకూడదనే మొన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్‌ హాజరు కాలేదనుకుంటున్నా’

కన్ను ఆర్పకుండా ఉండే పాము, మొసలి తర్వాత చంద్రబాబునే చూశా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. వ్యూహం సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్‌ ఏంటో అరటి పండు ఒలిచినట్లు ఒలిచి మీకు చూపిస్తా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రాజమండ్రిలో జరుగుతున్న మహానాడుపై కీలక కామెంట్స్ చేశారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు పోటాపోటీగా నిర్వహించాయి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ. ఎన్టీఆర్ సర్కిల్ లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతిపై విమర్శలు చేశారు కేశినేని చిన్ని.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే