AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stray Dogs: మనుషులు కనిపిస్తే చాలు పిక్కలు పీకేస్తున్న కుక్కలు.. నంద్యాలలో ఒకే రోజు ఎనిమిది మందిపై దాడి..

నంద్యాల జిల్లా డోన్‌లో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. ఒకేరోజు ఎనిమిది మందిపై దాడి చేశాయి. వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పక్కనున్న జనాలు అడ్డుకోవడంతో వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది.

Stray Dogs: మనుషులు కనిపిస్తే చాలు పిక్కలు పీకేస్తున్న కుక్కలు.. నంద్యాలలో ఒకే రోజు ఎనిమిది మందిపై దాడి..
Stray Dogs
Surya Kala
|

Updated on: May 29, 2023 | 6:46 AM

Share

ఏపీలో వీధికుక్కల దాడులు ఏమాత్రం తగ్గటం లేదు. మనుషులు కనిపిస్తే చాలు.. పిక్కలు పీకేస్తున్నాయి కుక్కలు. దాంతో.. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. నంద్యాల జిల్లా డోన్‌లో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. ఒకేరోజు ఎనిమిది మందిపై దాడి చేశాయి. వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పక్కనున్న జనాలు అడ్డుకోవడంతో వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది. వీధికుక్కల దాడిలో గాయపడ్డవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీధికుక్కల వరుస దాడులపై డోన్‌ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే.. వీధి కుక్కల స్వైర విహారంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీధికుక్కల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు డోన్‌ ప్రజలు.

మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలోనూ వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై దాడి చేయడంతో కంటి వద్ద తీవ్ర గాయమైంది. అయితే.. తల్లిదండ్రులు పక్కనే ఉండి.. కుక్కలను వెళ్లగొట్టడంతో బాలుడిని వదిలేసి వెళ్లిపోయాయి. దాంతో.. పెనుప్రమాదం తప్పింది. వీధి కుక్కల దాడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కుక్కలను నియంత్రించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. పిల్లల ప్రాణాలు పోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. చిన్నపిల్లల మృతి ఘటనలతోనైనా అధికారులు అప్రమత్తం కావాలని.. వీధి కుక్కలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!