Andhra Pradesh: భర్త కోసం భార్య.. భార్య కోసం భర్త.. ఎవరూ ఊహించని రీతిలో ఏం చేశారో తెలుసా..?
గుంటూరు జిల్లాలో ఓ గర్భిణీ తన భర్త కోసం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. కడప జిల్లాలో ఓ భర్త.. తన భార్య కోసం సెల్ టవరెక్కాడు. యాదృశ్చికంగా జరిగిన ఈ రెండు ఘటనలు ఆసక్తికరంగా మారాయి.
గుంటూరు జిల్లాలో ఓ గర్భిణీ తన భర్త కోసం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. కడప జిల్లాలో ఓ భర్త.. తన భార్య కోసం సెల్ టవరెక్కాడు. యాదృశ్చికంగా జరిగిన ఈ రెండు ఘటనలు ఆసక్తికరంగా మారాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ గర్భిణీకి భర్త విషయంలో పెద్ద కష్టం వచ్చి పడింది. తన భర్త సునీల్ కొద్దిరోజులుగా కనిపించడంలేదని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది సుజాత అనే గర్భిణీ మహిళ. అయితే.. ఆ కేసు విషయంలో పోలీసులు స్పందించడంలేదంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ఎనిమిది నెలల గర్భిణీ అయిన సుజాత.. ప్లకార్డు పట్టుకుని నిరసనకు దిగడంతో.. పోలీసులు అప్రమత్తమై సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా.. ఓ మహిళా వాలంటీర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని.. తనను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందింది. అత్తింటివారు, వాలంటీర్ కలసి తన భర్త కనిపించకుండా చేస్తున్నారని చెప్తోంది. డెలివరీ టైమ్‌లో భర్తను దూరం చేస్తుండటంపై కన్నీటి పర్యంతమైంది.
సెల్ టవర్ ఎక్కి..
ఇదిలావుంటే.. భార్య సంసారానికి రావడంలేదని కడప జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవరెక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. పులివెందులలోని నగరిగుట్టకు చెందిన సంతోష్ దంపతులకు మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో.. కొద్దిరోజులు క్రితం భార్య పట్టింటికి వెళ్లింది. ఎన్ని రోజులు చూసినా.. రాకపోతుండటంతో సంతోష్ సెల్ టవరెక్కి ఆందోళన చేశాడు. సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు.. సెల్ టవర్ దగ్గరకు చేరుకుని.. బాధితుడితో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి.. సంతోష్‌ను సెల్ టవర్ పైనుంచి కిందికి దింపారు. అనంతరం.. సంతోష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు పులివెందుల పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..