Alluri District: అల్లూరి జిల్లా ఎస్పీ మంచి మనసు.. ఎళ్లుగా తీరని ఆదివాసీల నీటి కష్టాలకు చిటికెలో చెక్
అది మావోయిస్టు ప్రాభల్య ప్రాంతం..! అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటుంది. ఇక దశాబ్దాలుగా వారిని వేధిస్తోన్న మంచినీటి సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆదివాసీల నీటి కష్టాలు తీరాయి. అల్లూరి జిల్లా చింతగరువులో ఆదివాసీలు..
అది మావోయిస్టు ప్రాభల్య ప్రాంతం..! అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటుంది. ఇక దశాబ్దాలుగా వారిని వేధిస్తోన్న మంచినీటి సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆదివాసీల నీటి కష్టాలు తీరాయి. అల్లూరి జిల్లా చింతగరువులో ఆదివాసీలు తాగునీటి సమస్యతో సతమతమౌతున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల మీద నడవాల్సిన దయనీయపరిస్థితి. కిలోమీటర్లు నడిచినా బురద నీరే వారికి గతి. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు వెళ్ళిన పోలీసులు ఏదైనా సమస్య ఉంటే నిర్భయంగా చెప్పాలని ప్రజలకు సూచించారు. దీంతో ఈ ఏడాది మార్చిలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన గిరిజనులు… నీటి సమస్యపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్పీ సమస్యపై స్పందించి.. చింతగరువు గిరిజనులకు తాగునీటి సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమృత జలధార కార్యక్రమం ద్వారా బోర్వెల్ ని తవ్వించారు. ట్యాంకు నిర్మాణం చేసి సుమారు 100 కుటుంబాలకు నీరు అందించే ఏర్పాటు చేశారు ఎస్పీ తూహిన్ సిన్హా. అసాంఘిక శక్తుల వ్యవహారాలకు దూరంగా ఉండటం వల్ల ఈ రోజు మీ సమస్య పరిష్కారం అయ్యిందన్నారు తూహిన్ సిన్హా. గిరిజనుల నీటి సమస్యను తీర్చడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. దీర్ఘకాల సమస్య రోజుల వ్యవధిలోనే పూర్తి కావడంతో పోలీసులకు చేతులెత్తి నమస్కరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.