Telugu News Telangana TS IT Minister KTR backs idea of installing kiosks at various popular spots
KTR on kiosks: త్వరలోనే హైదరాబాద్ సహా పలు చోట్ల కియోస్క్‌ల ఏర్పాటు.. అధికారులకు కేటీఆర్ ఆదేశాలు..
KTR on kiosks: హైదరాబాద్, వరంగల్ వంటి పలు నగరాల్లోని ప్రముఖ ప్రదేశాల సమాచారాన్ని తెలుసుకోవడానికి సందర్శకులకు కియోస్క్‌లుగా ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. లండన్‌లో ప్రముఖ ప్రాంతాల స్ట్రీట్ మ్యాప్..
KTR on kiosks: హైదరాబాద్, వరంగల్ వంటి పలు నగరాల్లోని ప్రముఖ ప్రదేశాల సమాచారాన్ని తెలుసుకోవడానికి సందర్శకులకు కియోస్క్‌లుగా ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. లండన్‌లో ప్రముఖ ప్రాంతాల స్ట్రీట్ మ్యాప్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి విషయాలను కియోస్క్ ద్వారా తెలుసుకోవచ్చని, అలాంటివి తెలంగాణలో పెడితే బాగుంటుందని ఓ నెటిిజన్ పెట్టిన పోస్ట్‌పై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ‘వాటిని త్వరలోనే హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామ’న్న ఆయన.. కియోస్కలపై అధ్యయనం చేసి, ముందుగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు.
ఇక ఈ కియోస్క్‌ల గురించి చెప్పుకోవాలంటే.. ఇవి పర్యాటకులు తాము ఉన్న నగర పరిధిలోని ప్రదేశాలకు సులభంగా చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలతో పాటు, స్ట్రీట్ మ్యాప్‌లు, డైరెక్షన్స్, ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్ వంటి సమాచారాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడతాయి.